EPF Money at Your Fingertips: ఇక చిటికెలో డబ్బులు.. యూపీఐ ద్వారా విత్​డ్రా!

EPF Money at Your Fingertips: ఇక చిటికెలో డబ్బులు.. యూపీఐ ద్వారా విత్​డ్రా!
x
Highlights

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఇకపై క్లెయిమ్ ఫారాలు లేకుండా నేరుగా యూపీఐ (UPI) ద్వారా పీఎఫ్ డబ్బులు విత్​డ్రా చేసుకునే కొత్త విధానం ఏప్రిల్ 2026 నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్త అందించింది. ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ ఫారాలు, ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు లేకుండా.. నేరుగా యూపీఐ (UPI) ద్వారా మీ ఈపీఎఫ్ సొమ్మును విత్​డ్రా చేసుకునే విప్లవాత్మక మార్పు రాబోతోంది.

ఏప్రిల్ 2026 నాటికి కొత్త వ్యవస్థ!

ప్రస్తుతం ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంది. దీనిని సులభతరం చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ సరికొత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. సుమారు 8 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూర్చే ఈ విధానం ఏప్రిల్ 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

యూపీఐ ద్వారా విత్​డ్రా ఎలా జరుగుతుంది?

సాధారణంగా మనం గూగుల్ పే లేదా ఫోన్ పే ఎలా వాడుతామో, అదే తరహాలో ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను వాడుకునే వెసులుబాటు కలుగుతుంది:

లింక్డ్ బ్యాలెన్స్: సభ్యులు తమ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను మొబైల్ స్క్రీన్‌పై చూడవచ్చు.

సెక్యూర్ ట్రాన్సాక్షన్: యూపీఐ పిన్ ఉపయోగించి సురక్షితంగా డబ్బును మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.

తక్షణ లభ్యత: ఖాతాలోకి డబ్బు చేరిన వెంటనే డిజిటల్ పేమెంట్స్ కోసం లేదా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవడానికి వాడుకోవచ్చు.

గమనిక: సభ్యుల భద్రత దృష్ట్యా మొత్తం నిధుల్లో కొంత భాగాన్ని ఫ్రీజ్ చేసి, మిగిలిన మెజారిటీ వాటాను విత్​డ్రా చేసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.

కీలక మార్పులు ఇవే..

కేంద్ర బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఇటీవలే ఉద్యోగుల ప్రయోజనాల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది:

  1. రూ. 5 లక్షల వరకు ఆటో సెటిల్‌మెంట్: ఇప్పటికే అటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల 3 రోజుల్లోనే డబ్బులు అందుతున్నాయి.
  2. నిబంధనల సరళీకరణ: గతంలోని 13 రకాల క్లిష్టమైన నిబంధనలను రద్దు చేసి, కేవలం 3 వర్గాలుగా (అవసరాలు, ఇల్లు, ప్రత్యేక పరిస్థితులు) విభజించారు.
  3. 100% ఉపసంహరణ: అర్హత ఉన్న నిధుల్లో 100% వరకు (మొత్తం నిధుల్లో 75%) విత్​డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి మరియు యాజమాన్య వాటా రెండూ ఉంటాయి.
  4. తగ్గిన సేవా కాలం: పార్షియల్ విత్ డ్రాయల్స్ కోసం కనీస సేవా కాలాన్ని కేవలం 12 నెలలకు తగ్గించారు.
  5. చదువు, పెళ్లిళ్ల కోసం: పిల్లల చదువుల కోసం 10 సార్లు, పెళ్లిళ్ల కోసం 5 సార్లు డబ్బు తీసుకునే వీలు కల్పించారు.

ఎందుకు ఈ మార్పు?

ఈపీఎఫ్‌ఓ నేరుగా బ్యాంక్ కాదు కాబట్టి, బ్యాంకుల సహకారంతో ఈ యూపీఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఏటా దాదాపు 5 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్న ఈ సంస్థ, సేవల్లో పారదర్శకత పెంచడానికి మరియు మధ్యతరగతి ఉద్యోగులకు అత్యవసర సమయంలో అండగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories