EPFO Rules: ఈపీఎఫ్ఓలో కీలక రూల్స్‎లో మార్పులు..వారి పీఎఫ్ విత్‏డ్రాకు ఆధార్ అవసరం లేదు

EPFO Rules: ఈపీఎఫ్ఓలో కీలక రూల్స్‎లో మార్పులు..వారి పీఎఫ్ విత్‏డ్రాకు ఆధార్ అవసరం లేదు
x
Highlights

EPFO New Rules: భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటుంది. వీరికి రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్...

EPFO New Rules: భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటుంది. వీరికి రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా సొమ్మును పొదుపు చేస్తుంది. ఉద్యోగితోపాటు యజమాని సమానా వాటాతో ఉండే ఈపీఎఫ్ విత్ డ్రాకు మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్బాల్లోనే పీఎఫ్ విత్ డ్రాకు ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తన రూల్స్ మార్చే ఛాన్స్ ఉంది. ఆ రూల్స్ గురించి తెలుసుకుందాం.

నేటి కాలంలో పీఎఫ్ విత్ డ్రా కు ఆధార్ అనేది తప్పనిసరి. యూఏఎన్ నెంబర్ ను ఆధార్ తో తప్పనిసరిగా లింక్ చేయాలి. అయితే ఈమధ్యేకొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఆధార్ లేని ఉద్యోగులు ఈపీఎఫ్ఓ క్లెయిమ్స్ చేసుకోవచ్చు.

ఆధార్ లేకుండా పీఎఫ్ విత్ డ్రా చేయాలంటే పాస్ పోర్టులు, పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డులు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు అవసరం ఉంటుంది. అలాగే రూ. 5 లక్షలకు మించిన క్లెయిమ్స్ లను ప్రాసెసర్ చేయాలంటే యజమాని ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది.

భారత్ లో పనిచేసి, ఆధార్ పొందలేని అంతర్జాతీయఉద్యోగులు తమ స్వదేశాలకు తిరిగి వస్తే వారి పీఎఫ్ విత్ డ్రాకు ఆధార్ అవసరం ఉండదు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరుల శాశ్వతంగా విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు పీఎఫ్ విత్ డ్రాకు ఆధార్ అవసరం ఉండదని ఈపీఎఫ్ఓ ఈమధ్యే స్పష్టం చేసింది.

అయితే ఇలాంటి క్లెయిమ్స్ ను ఆమోదించే ముందు అన్ని క్లెయిమ్స్ లను జాగ్రత్తగా పరిశీలించాలని ఈపీఎఫ్ఓ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇది అప్రూవల్ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ద్వారా ఈ ఆఫీస్ ఫైల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఉద్యోగులు అదే యూఏఎన్ ను నిర్వహించాలని లేదా వారి ఇంతకుముందు సర్వీస్ రికార్డులను అదే యూఏఎన్ కు బదిలీ చేయాలి. ఎందుకంటే ఇది క్లెయిమ్ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు వేగవంతం చేసేందుకు సహాయపడుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories