Most Expensive Spices: ప్రపంచంలో ఈ మసాలాలు ఎందుకంత రేటు?

Most Expensive Spices
x

Most Expensive Spices: ప్రపంచంలో ఈ మసాలాలు ఎందుకంత రేటు?

Highlights

Most Expensive Spices: ఖరీదైన ఇళ్లు ఉన్నాయని విన్నాం. ఖరీదైనా కార్లూ చూసాం. కానీ ఖరీదైన మసాలాలు కూడా ఉంటాయా? అంటే..? అవును. అంటాను. ఎందుకంటే పోపుల పెట్టెలో తరచూ మనకు కనిపించే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వంటి మసాలాలు టూ ఎక్స్ పెన్సివ్. మార్కెట్‌లో వీటి రేట్లు ఎప్పుడూ టాప్ లోనే ఉంటాయి.

Most Expensive Spices: ఖరీదైన ఇళ్లు ఉన్నాయని విన్నాం. ఖరీదైనా కార్లూ చూసాం. కానీ ఖరీదైన మసాలాలు కూడా ఉంటాయా? అంటే..? అవును. అంటాను. ఎందుకంటే పోపుల పెట్టెలో తరచూ మనకు కనిపించే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వంటి మసాలాలు టూ ఎక్స్ పెన్సివ్. మార్కెట్‌లో వీటి రేట్లు ఎప్పుడూ టాప్ లోనే ఉంటాయి. సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంటాయి. మరి ఈ మసాలాలు ఎందుకంత ఖరీదు.? మనకు తక్కువ రేటులో దొరికే మసాలాలేంటి? అసలు.. వాటి వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.


వంటకాలకు ప్రత్యేకమైన రుచిని అందించేవి.. సుగంధ ద్రవ్యాలు. రుచి మాత్రమేనా..వాటి వాసన కూడా అదిరిపోతుంది. అందులోకీ నేచురల్ గా చెట్ల నుండి వస్తాయేమో.. వాటిలో ఔషధ గుణాలకు కొదవే ఉండదు. ఎటువంటి జబ్బులకైనా మన వంటగదిలో ఉండే పోపులపెట్టెతో ట్రీట్మెంట్ చేసేయొచ్చు. అయితే.. అలాంటి కొన్ని మసాలా దినుసులు కొనాలంటే మాత్రం.. వెరీ కాస్ట్లీ. ఒక గ్రాము దినుసులు... వేల రూపాయల్లో ఉంటాయి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క..ఒక సుంగంధ ద్రవ్యంగా అందరికీ తెలిసిందే. దీన్నే ఇంగ్లీష్ లో సినామన్ అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే ప్రపంచంలో ఉన్న మసాలాల్లో ఈ దాల్చిన చెక్కే అత్యంత కాస్ట్లీ. అయితే మనకు మాత్రం.. ఇది మార్కెట్లో చాలా చౌకగా దొరుకుతుంది. ఎందుకంటే మనం వాడే చెక్క..సెకండ్ క్వాలిటీ దాల్చినచెక్క కాబట్టి. మనం ఎక్కడ చూసినా దాల్చిన చెక్క ఒకలాగే కనిపిస్తుంది. కానీ దాల్చిన చెక్కలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.

మొదటిది, శ్రీలంక నుండి వచ్చే దాల్చిన చెక్క. దీన్నే సిలోన్ దాల్చిన చెక్క అంటారు. ఇదే నిజమైన దాల్చిన చెక్క. ఇది సున్నితమైన పూలతో పాటు సిట్రస్ స్మెల్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది క్విల్ రూపంలో, లేత గోధుమ రంగులో ఉంటుంది. సన్నగా కూడా ఉంటుంది. పట్టుకుంటే ఈజీగా విరిగిపోతుంది. ఒక కేజీ సిలోన్ దాల్చిన చెక్కను కొనాలనుకుంటే.. దాని రేటు వేలల్లోనే ఉంటుంది.

ఇక రెండోది కాసియా దాల్చిన చెక్క. ఇది చైనాకు చెందిన చెక్క. ఇదే ఎక్కువగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది మందంగా, ముదురు రంగులో ఉంటుంది. సిలోన్ రకంతో పోలిస్తే దీనికి వాసన కూడా తక్కువే. అందుకే దీని రేటు తక్కువగా ఉంటుంది.

యాలకులు

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో పచ్చి ఏలకులు ఒకటి. దాదాపు కిలో యాలకులు వెయ్యి నుంచి ఆరువేల రూపాయల వరకు ఉంటుంది. మంచి యాలకులు కావాలంటే కిలోకు 3 వేల రూపాయలైనా పెట్టాల్సిందే మరి. అయినా ఇవి ఎంత ఖరీదు ఉన్నా కొంటుంటారనుకోండి. ఎందుకంటే... టీ నుంచి మొదలు అన్ని రకాల స్వీట్లు, మసాలా వంటల్లో యాలకులు ఉండాల్సిందే కదా. అందుకే దీన్ని స్సైసెస్ క్వీన్ అని పిలుస్తారు.

యాలకులు ధర ఎక్కువగా ఉండడానికి మరో కారణం..వాటిని సాగు చేయడంలో ఎక్కువ శ్రమ పెట్టాల్సి రావడం. ఒక కిలో యాలకుల కోసం ఆరు కిలోల ముడి గింజలు అవసరం ఉంటాయి. అంటే చెట్ల నుండి ఆరు కిలోల యాలకులు తీయగా, దాని నుంచి జస్ట్ కిలో యాలకులు మాత్రమే ఫైనల్ గా వస్తాయి. పని ప్రాసెస్ ఎక్కువగా ఉండటం, అలాగే కూలీలతో పనిచేయించుకోవాల్సి రావడం వల్ల కూడా వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అయితే మనం వాడే యాలకులు అంత రేటు ఉండవు కదా అంటే..అవును ఎందుకంటే మనం వాడేవి రెండో రకం యాలకులు. వీటికి మొదటిరకం కంటే సువాసన తక్కువగా ఉంటుంది.

లవంగాలు

ఇది నూనెను కలిగి ఉండే ఒక మొగ్గ. ఔషధ గుణాలెన్నో కలిగిన మరో సుగంధ ద్రవ్యం. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంటే కణుతులు ఏర్పడకుండా రక్షణ కవచంలా ఉంటుంది. షుగర్ పేషెంట్లకూ ఇది మంచిదే. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది. తలనొప్పి, పంటి నొప్పిలకు ఉపశమనాన్ని ఇస్తుంది. వీటి వాసన ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను ఇస్తాయి. సాధారణంగా లవంగాలు.. మూడు క్వాలిటీలలో ఉంటాయి. మొదటిది మొగ్గ పూర్తిగా నూనెతో ఉండి కిరీటాన్ని కలిగి ఉంటుంది. దీనికి మార్కెట్లో మంచిరేటు ఉంటుంది. అలాగే రెండో క్వాలిటీ.. మొగ్గ చుట్టూ ఉండే కిరీటాలు అక్కడక్కడా విరిగిపోయి ఉంటాయి. దీని సైజు కాస్త చిన్నగానే ఉంటుంది. ఇక మూడో క్వాలిటీ.. కిరీటాలు విరిగిపోయి, పుల్లల్లా ఉంటాయి. ముందు రెండు రకాలతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories