Flipkart Layoffs: ఫ్లిప్‌కార్ట్‌లో లేఆఫ్స్ కలకలం.. 500 మంది ఉద్యోగులపై వేటు

Flipkart Layoffs
x

Flipkart Layoffs: ఫ్లిప్‌కార్ట్‌లో లేఆఫ్స్ కలకలం.. 500 మంది ఉద్యోగులపై వేటు 

Highlights

Flipkart Layoffs: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ, పనితీరు సరిగ్గా లేదనే కారణంతో 3-4% మందిని తొలగించింది. ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక స్థితిగతులు మరియు లేఆఫ్స్‌కు గల కారణాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.

Flipkart Layoffs: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా సుమారు 400 నుంచి 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఎకనామిక్ టైమ్స్ (ET) కథనం ప్రకారం.. ఈ తొలగింపులు కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 3 నుంచి 4 శాతంగా ఉన్నాయి. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ ప్రతి సంవత్సరం పనితీరు సరిగ్గా లేని 1 నుంచి 2 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తుంది. కానీ, ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు (3-4%) కావడం గమనార్హం. ఈ ఏడాది 'పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్' (PIP) కింద ఉంచిన ఉద్యోగుల సంఖ్య కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంది. తక్కువ రేటింగ్ వచ్చిన వారిని కంపెనీ ఇంటికి సాగనంపింది.

లేఆఫ్స్‌లపై కంపెనీ స్పందింస్తూ.. "రెగ్యులర్ పర్ఫార్మెన్స్ రివ్యూలో భాగంగానే కొంతమంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలుగుతున్నారు. ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన మద్దతును అందిస్తున్నాం" అని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ 'టోఫ్లర్' (Tofler) గణాంకాల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది:

* 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,358.7 కోట్లుగా ఉన్న ఏకీకృత నికర నష్టం, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1,494.2 కోట్లకు తగ్గింది.

* కంపెనీ ఆదాయం 14% పెరిగి రూ. 20,493 కోట్లకు చేరింది. అయితే, అంతకుముందు ఏడాదితో (21% వృద్ధి) పోలిస్తే వృద్ధి రేటు కాస్త మందగించింది.

* ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 2024లో 'Flipkart Minutes' పేరుతో క్విక్ కామర్స్ సేవలను కూడా ప్రారంభించింది.

వాల్‌మార్ట్ (Walmart) గ్రూపులోని ఇతర కంపెనీల్లో ఇలాంటి భారీ తొలగింపులు లేవని, కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే ఈ పరిస్థితి నెలకొందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సెల్లర్ కమీషన్లు, అడ్వర్టైజింగ్, ఇతర సేవల ద్వారా ఈ సంస్థ ప్రధానంగా ఆదాయాన్ని గడిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories