Gold Price: తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా గణనీయంగా డౌన్!

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా గణనీయంగా డౌన్!
x

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా గణనీయంగా డౌన్!

Highlights

బంగారం, వెండి కొనుగోలు దారులకు ఇది ఊరటనిచ్చే వార్తే. వాణిజ్య ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్‌లో వెలిసిన బలహీన సంకేతాల కారణంగా సోమవారం దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా వాణిజ్య సుంకాలపై నెలకొన్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు.

ధరల తేడా ఇలా ఉంది:

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.425 తగ్గి రూ.96,596కి చేరింది. ఆదివారం ఇది రూ.97,021గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా క్షీణించింది. కిలో వెండి ధర ఏకంగా రూ.1,049 తగ్గి రూ.1,06,531గా నమోదైంది, ఇది ఆదివారం రూ.1,07,580గా ఉండింది.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం:

అమెరికా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తుండటంతో ప్రపంచ వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. దీంతో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెరిగింది. ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన నిపుణుడు జతిన్ త్రివేది మాట్లాడుతూ, ధరల పడిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) ఆగస్టు డెలివరీ కాంట్రాక్టు కూడా రూ.487 నష్టపోయి రూ.96,503 వద్ద ముగిసింది.

ఈ ధరల తగ్గుదల బంగారం, వెండి పెట్టుబడిదారులకు తాత్కాలికంగా లాభదాయకమే అయినప్పటికీ, వచ్చే రోజుల్లో గ్లోబల్ ట్రేడ్ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపైనే రేట్ల దిశ ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories