Gold Price Today : మగువలకు ఊరట.. స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి

Gold Price Today : మగువలకు ఊరట.. స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి
x
Highlights

మగువలకు ఊరట.. స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి

Gold Price Today : ఆడవారికి బంగారమంటే కేవలం అలంకారం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక నమ్మకమైన నేస్తం. పుట్టినరోజు అయినా, పెళ్లిరోజైనా సరే, మెడలో పసిడి హారం మెరిసిపోవాల్సిందే. అయితే, గత కొన్నాళ్లుగా పసిడి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు బంగారం కొనాలంటే ధరల పట్టికను రోజుకు పదిసార్లు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నేడు ఫిబ్రవరి 15, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో, ఎక్కడ కొంటే లాభమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని పసిడి ప్రియులకు నేడు కాస్త ఊరట లభించింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరల్లో పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల (ప్యూర్ గోల్డ్) 10 గ్రాముల ధర రూ.1,57,750 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ.1,44,600 వద్ద ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,310 గా నమోదైంది. గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల బంగారం ధరలు రూ. 1.6 లక్షల దిశగా పరుగులు తీస్తున్నాయి.

చెన్నై నగరంలో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్లు రూ.1,58,840 కాగా, 22 క్యారెట్లు రూ.1,45,600. అలాగే ముంబై, బెంగళూరు, విజయవాడల్లో హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా 24 క్యారెట్లు రూ.1,57,750 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,57,900గా ఉంది.

బంగారం స్థిరంగా ఉన్నా, వెండి మాత్రం ఈ నెలలో తన దూకుడును తగ్గించింది. ఫిబ్రవరిలో వెండి ధరలు దాదాపు 21% మేర తగ్గాయి. హైదరాబాద్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,75,000 నుంచి రూ.2,80,000 మధ్య ట్రేడ్ అవుతోంది. నేడు కిలో వెండిపై సుమారు రూ.5,000 వరకు తగ్గుదల కనిపించడం విశేషం. వెండి కొనాలనుకునే వారికి ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories