
రూ.పది తగ్గింది కదా అని పండగ చేసుకోకండి.. తులం బంగారం రేటు చూస్తే గుండె ఆగుతుంది
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక రకంగా ఊరటనిచ్చే వార్తే కానీ, ధరలు మాత్రం ఇంకా చుక్కలను తాకుతూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు ఫిబ్రవరి 23, సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయితే ఈ తగ్గుదల కేవలం నామమాత్రమే కావడంతో తులం బంగారం ధర ఇంకా రూ.1.60 లక్షల మార్కుకు చేరువలోనే ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు ఎంత ఉన్నా కొనుగోళ్లు మాత్రం జోరుగానే సాగుతున్నాయి.
నేడు మార్కెట్లో పసిడి, వెండి ధరలు
దేశీయ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 గా ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,45,990 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేవలం పది రూపాయల మేర తగ్గుదల నమోదైంది. అటు వెండి ధర కూడా సామాన్యులకు భారాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 5,145 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండటమే దేశీయంగా ఈ భారీ ధరలకు ప్రధాన కారణం.
ముఖ్య నగరాల్లో ధరల ఎలా ఉన్నాయంటే ?
మన దేశంలో పసిడి ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270 వద్ద ఉండగా.. చెన్నైలో మాత్రం ధర కొంచెం ఎక్కువగా రూ.1,60,140 గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉండే జీఎస్టీ, స్థానిక పన్నుల కారణంగా ఈ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తులం రూ.50 వేలు ఉంటేనే బాబోయ్ అన్న వాళ్ళు, ఇప్పుడు లక్షన్నర దాటినా కొనక తప్పని పరిస్థితి నెలకొంది.
ధరలు పెరగడానికి అసలు కారణాలేంటి?
అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. డాలర్ విలువ తగ్గడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో ధరల దిశను నిర్ణయించనున్నాయి.
మున్ముందు ధరలు తగ్గుతాయా?
రానున్న వారం రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని నిరుద్యోగ గణాంకాలు, ఆర్థిక విశ్వాసం వంటి అంశాలు పసిడి పరుగుకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు ధర కంటే బంగారం రూ.25 వేలు తక్కువగానే ఉన్నప్పటికీ, సామాన్యుడికి మాత్రం ఇది అందనంత ఎత్తులోనే ఉంది. కాబట్టి పసిడి ప్రియులు ధరలు కొంచెం తగ్గినప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




