
పెళ్లిళ్ల సీజన్.. బంగారం ధరల మారథాన్.. ఈరోజు తులం ఎంతంటే ?
Gold Price : బంగారం కొనాలనుకునే వారికి వరుసగా రెండో రోజు షాకింగ్ న్యూస్ అందింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం స్వల్పంగా పెరిగిన ధరలు, నేడు (శుక్రవారం) కూడా అదే బాటలో పయనిస్తూ కొనుగోలుదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న వేళ, ఈ ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. అంతర్జాతీయంగా ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి, దేశీయంగానూ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
మన దగ్గర పసిడి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్లో 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర సుమారు రూ.1,56,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించడం విశేషం.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,650 ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,58,190 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరలు స్థిరంగా ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ధరలన్నీ కేవలం ప్రాథమిక రేట్లు మాత్రమే. వీటిపై అదనంగా జీఎస్టీ, తరుగు వంటివి కలిపితే ఫైనల్ బిల్లు మరింత భారంగా మారే అవకాశం ఉంది.
వెండి ధరల పరిస్థితి
బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర నేడు రూ.2,70,100 మార్కును తాకింది. నిన్నటి కంటే కిలోపై సుమారు వంద రూపాయల మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో బంగారం ధరలు రూ.1.60 లక్షల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




