Gold Purchase Limit: 2026 బడ్జెట్‌లో ‘గోల్డ్‌ కొనడానికి రూ.2 లక్షల లిమిట్‌’ రూల్‌ మారుతుందా?

Gold Purchase Limit: 2026 బడ్జెట్‌లో ‘గోల్డ్‌ కొనడానికి రూ.2 లక్షల లిమిట్‌’ రూల్‌ మారుతుందా?
x
Highlights

Gold Purchase Limit: బంగారం కొనుగోలుపై రూ. 2 లక్షల పాన్ కార్డ్ లిమిట్ మారనుందా? 2026 బడ్జెట్‌లో కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై భారీ అంచనాలు. పెరిగిన బంగారం ధరల దృష్ట్యా ఈ నిబంధన సడలించాలని వినియోగదారుల విజ్ఞప్తి.

Gold Purchase Limit: ప్రస్తుతం బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాములకు రూ. 1.70 లక్షల మార్కును తాకాయి. ఈ పరిస్థితుల్లో కేవలం తులంన్నర బంగారం కొన్నా.. నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల లిమిట్ దాటిపోతోంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా తమ పాన్ (PAN) లేదా ఆధార్ వివరాలను జ్యువెలర్లకు ఇవ్వాల్సి వస్తోంది. 2016 నుండి అమల్లో ఉన్న ఈ నిబంధనను 2026 బడ్జెట్‌లో కేంద్రం సవరిస్తుందని బులియన్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత రూల్ ఏం చెబుతోంది? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139A ప్రకారం, ఒకే లావాదేవీలో (Single Transaction) రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి. పాన్ లేని పక్షంలో ఫామ్-60 లేదా ఆధార్ నంబర్ సమర్పించాలి. నల్లధనాన్ని అరికట్టేందుకు 2016 జనవరి 1న ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.


పరిమితి పెంచాలని ఎందుకు కోరుతున్నారు?

ధరల పెరుగుదల: 2016లో ఈ రూల్ వచ్చినప్పుడు బంగారం ధర 10 గ్రాములకు రూ. 30,000 లోపు ఉండేది. అప్పుడు రూ. 2 లక్షలంటే సుమారు 6-7 తులాల బంగారం వచ్చేది. కానీ ఇప్పుడు తులంన్నరకే ఆ లిమిట్ దాటిపోతోంది.

పెళ్లిళ్ల సీజన్: వివాహాల సమయంలో చేసే కనీస కొనుగోళ్లు కూడా ఇప్పుడు రిపోర్టింగ్ పరిధిలోకి వస్తున్నాయి. దీనివల్ల పన్ను ఎగవేసే ఉద్దేశం లేని సామాన్యులు కూడా ఐటీ నోటీసుల భయంతో ఆందోళన చెందుతున్నారు.

వ్యాపారుల ఇబ్బందులు: ప్రతి చిన్న లావాదేవీని ఎస్‌ఎఫ్‌టి (SFT) కింద రిపోర్ట్ చేయడం జ్యువెలర్లకు భారంగా మారుతోంది.

బడ్జెట్ 2026లో మార్పు ఉంటుందా? ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లిమిట్‌ను రూ. 5 లక్షలకు పెంచాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటే, వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించినట్లే.


Show Full Article
Print Article
Next Story
More Stories