Gold Rate: మహిళలకు షాక్.. బంగారం ధరల్లో భారీ జంప్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate: మహిళలకు షాక్.. బంగారం ధరల్లో భారీ జంప్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?
x
Highlights

Gold Rate: మహిళలకు షాక్.. బంగారం ధరల్లో భారీ జంప్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate: భారతీయ మహిళలకు బంగారు ఆభరణాలపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, వివాహాలు, కుటుంబ వేడుకలు వచ్చినప్పుడల్లా ఒంటి నిండా బంగారు నగలు ధరించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఒకటి రెండు కాదు, ఏ నగా మిస్సవకూడదనే భావనతో బంగారాన్ని అలంకారంగా మాత్రమే కాకుండా ప్రతిష్ఠకు, హోదాకు చిహ్నంగా కూడా భావిస్తారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గౌరవంగా చూస్తారనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. అందుకే తరచూ బంగారు ఆభరణాల కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయి.

అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజుకో కొత్త రికార్డు స్థాయికి పసిడి ధరలు చేరుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు అనిపించినా, ఈ రోజు మాత్రం అంచనాలకు అందని రీతిలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్ సంబంధిత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా విధిస్తున్న సుంకాలు, వాటికి ప్రతిగా యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న చర్యలు, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితి ఇవన్నీ కలిసి పసిడి ధరలను పైకి నెట్టాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు బంగారం రేట్లు ఎంత మేర పెరిగాయో తెలుసుకుంటే ఆశ్చర్యమే కలుగుతుంది. ముఖ్యంగా నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర గణనీయంగా పెరిగింది. అలాగే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం కూడా కొత్త గరిష్ఠాలకు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,250 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,34,050కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా తగ్గకుండా దూసుకెళ్లింది. ఈ క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,460 పెరగడంతో, మొత్తం ధర రూ. 1,46,240 స్థాయికి చేరింది.

ఈ విధంగా ఒక్క రోజులోనే బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయా? లేక కొంత స్థిరత్వం వస్తుందా? అన్నది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories