Gold Rate: శుభవార్త! గత వారంలో దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..

Gold and Silver rates trends last week and today rates
x

గతవారంలో బంగారం వెండి ధరల పోకడ ఇలా ఉంది 

Highlights

Gold Rate: గతవారంలో బంగారం, వెండి ధరలు అటూ, ఇటూ కదలాడి తగ్గుదల కనబరిచాయి. గతవారం బంగారం ధరల తీరు తెన్నూ ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ఈ వారంలో తగ్గుముఖం పట్టాయి. గత సోమవారం (15-02-2021) ప్రారంభ ధరతో పోల్చుకుంటే, ఈ వారం మరింత కిందికి బంగారం ధరలు దిగివచ్చాయి. రోజువారీగా చూసుకుంటే.. సోమవారం, మంగళవారం నిలకడగా ఉన్న బంగారం ధరలు బుధవారం నుంచి శుక్రవారం వరకూ తగ్గుదల బాటలో నడిచాయి. తరువాత శనివారం కాస్త పైకి ఎగసినా.. మొత్తమ్మీద చూసుకుంటే తగ్గుదాలనే కనబరిచాయి. ఇక వెండి ధరలు వారం అంతా అటూ ఇటూ దోబూచులాడి..కొద్దిపాటి తగ్గుదలతో వారం ముగించాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు గత వారం ఇలా..

గత సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 44,250 రూపాయల వద్ద ప్రారంభం అయింది. మంగళవారం (16-02-2021) కూడా అదే ధర వద్ద నిలిచింది. అయితే, బుధవారం (17-02-2021) నాడు 500 రూపాయలు, గురువారం (18-02-2021) 350 రూపాయలు, శుక్రవారం (19-02-2021)400 రూపాయలు తగ్గింది. శనివారం(20-02-2021) తేదీన మాత్రం 250 రూపాయల పెరుగుదల కనబరిచింది. మొత్తంగా చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1000 రూపాయల తగ్గుదల కనబరిచింది. దీంతో ఈరోజు (22-02-2021) ౨౨ క్యారెట్ల పది గ్రాముల బంగారం 43,250 రూపాయల వద్ద ప్రారంభం అవుతున్నాయి.

ఇక గత సోమవారం(15-02-2021) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 48,290 రూపాయల వద్ద ప్రారంభం అయింది. మంగళవారం (16-02-2021) కూడా అదే ధర వద్ద నిలిచింది. అయితే, బుధవారం (17-02-2021) నాడు 560 రూపాయలు, గురువారం (18-02-2021) 380 రూపాయలు, శుక్రవారం (19-02-2021) 450 రూపాయలు తగ్గింది. శనివారం(20-02-2021) తేదీన మాత్రం 280 రూపాయల పెరుగుదల కనబరిచింది. మొత్తంగా చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1100 రూపాయల తగ్గుదల కనబరిచింది. దీంతో ఈరోజు (22-02-2021) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 47,190 రూపాయల వద్ద ప్రారంభం అవుతున్నాయి.

వెండి ధరలు గతవారం కదలాడాయి ఇలా..

మరోవైపు వెండి ధరలు అటూ ఇటూ ఊగిసలాడుతూ వచ్చాయి. వారం ప్రారంభంలోనే పెరుగుదల నమోదు చేసిన వెండి తగ్గుతూ పెరుగుతూ వచ్చి చివరకు అంతకు ముందు వారం ధరకు దగ్గరలో నిలిచింది. గత సోమవారం(15-02-2021) కేజీ వెండి అంతకు ముందు రోజు అంటే 14-02-2021(ఆదివారం) నాటి ధరకంటే 700 రూపాయల పెరుగుదల నమోదు చేసి 74.600 రూపాయలుగా ప్రారంభం అయింది. మంగళవారం (16-02-2021) 400 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. అయితే, బుధవారం (17-02-2021) నాడు ఏకంగా 1400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. తిరిగి గురువారం (18-02-2021) 700 రూపాయలు పెరిగిన వెండి ధరలు శుక్రవారం (19-02-2021) 900 రూపాయలు తగ్గింది. శనివారం(20-02-2021) తేదీన మాత్రం 400 రూపాయల పెరుగుదల కనబరిచింది. మొత్తంగా చూసుకుంటే కేజీ వెండిధర అంతకు ముందు వారం ముగింపు ధర 73,900 కంటే..వందరూపాయలు తగ్గి 73,800 రూపాయల వద్ద నిలిచింది. దీంతో ఈరోజు (22-02-2021) కేజీ వెండి ధర 73,800 రూపాయల వద్ద ప్రారంభం అవుతోంది.

ఇక్కడ ఇచ్చిన బంగారం, వెండి ధరల విశ్లేషణ ప్రతిరోజూ ప్రారంభ-ముగింపు ధరల ఆధారంగా ఇచ్చింది. సాధారణంగా బంగారం ధరలు రోజంతా మారుతూ వస్తుంటాయి. ఈరోజు బంగారం ధరలుగా పేర్కొన్న ధరలు గత ముగింపు ధరలు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు మార్కెట్లో రేట్లను బేరీజు వేసుకుని కొనుగోలు చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories