Gold Rate Today: పండగ ముందు పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారం ధర రూ. 92వేలు

Gold Rate Today: పండగ ముందు పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారం ధర రూ. 92వేలు
x
Highlights

Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో అంతర్జాతీయంగా మరోసారి బంగారం ధర భారీగా పెరిగిపోయింది. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత...

Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో అంతర్జాతీయంగా మరోసారి బంగారం ధర భారీగా పెరిగిపోయింది. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారం శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో రూ. 1,100 ఎగిసి 10 గ్రాములకు రూ. 92,150 వద్ద ముగిసింది. ఇది సరికొత్త గరిస్టా స్థాయి తాకడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద బంగారం 35శాతం ర్యాలీ చేసింది. 2024 ఏప్రిల్ 1న బంగారం ధరరూ. 68, 420 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి 23,730 వరకు లాభాలు చూసింది. ఒకవైపు ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కుంటుంటే మరోవైపు బంగారం పెట్టుబడిదారులకు కాసులు కురిపిస్తోంది.

ఢిల్లీ మార్కట్లో 99.5శాతం స్వచ్చత కలిగిన బంగారం కూడా రూ. 1,100 పెరిగి రూ. 91,700స్థాయికి చేరింది. వెండి ఒకే రోజు 1300 పెరిగింది. కిలో రూ. 1,03,000కు చేరుకుంది. మార్చి 19న గత రికార్డు రూ. 1,03,500 సమీపానికి చేరింది. బంగారం మరోకొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం, ఆర్థిక వ్రుద్ధిపై పడే ప్రభావం నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories