Gold Rate Today: పసిడి పంజా: ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం.. ఆల్‌టైమ్ రికార్డు ధరతో సామాన్యులకు షాక్!

Gold Rate Today: పసిడి పంజా: ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం.. ఆల్‌టైమ్ రికార్డు ధరతో సామాన్యులకు షాక్!
x

Gold Rate Today: పసిడి పంజా: ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం.. ఆల్‌టైమ్ రికార్డు ధరతో సామాన్యులకు షాక్!

Highlights

Gold Rate Today: పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు చుక్కలను తాకాయి.

Gold Rate Today: పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు చుక్కలను తాకాయి. శుక్రవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.5,000 పెరుగుదల నమోదు కావడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దేశీయ చరిత్రలో పసిడి ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి.

ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా బలగాల మోహరింపుతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,945 డాలర్లకు ఎగబాకింది.

హైదరాబాద్‌లో తాజా ధరలు ఇవే: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం మధ్యాహ్నం సమయానికి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,59,954 (రూ.5,000 పెరిగింది).

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,41,000 వద్ద కొనసాగుతోంది.

వెండి (1 కిలో): వెండి కూడా భారీగా పెరిగి కిలో రూ.3.25 లక్షల వద్ద రికార్డు స్థాయిని తాకింది.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ భారీ పెరుగుదల సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories