Gold Rate Today : పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today
x

Gold Rate Today Marginal Drop

Highlights

Gold Rate Today : మార్చి 9న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారంపై రూ.10, వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,630 వద్ద కొనసాగుతోంది.

Gold Rate Today : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న గందరగోళం పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ, గత రెండు మూడు రోజులుగా కాస్త శాంతిస్తున్నాయి. ఈ క్రమంలో మార్చి 9వ తేదీ సోమవారం నాడు భారతీయ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గగా, వెండి ధర కూడా దిగివచ్చింది.

నేడు (మార్చి 9) ఉదయం 6 గంటలకు నమోదైన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా తులం బంగారంపై సుమారు 10 రూపాయలు తగ్గింది. అంతర్జాతీయంగా ధరలు 2 శాతం మేర పెరిగినా, దేశీయంగా మాత్రం స్వల్పంగానే మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలతో పాటు ముంబై, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ (10 గ్రాములు) ధర రూ.1,63,630 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,990 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,63,790 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,50,014 వద్ద ట్రేడవుతోంది. ఇక చెన్నైలో ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,64,170 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,50,490 వద్ద కొనసాగుతోంది.

వెండి విషయానికి వస్తే గడిచిన కొద్ది రోజుల్లో 3 శాతం మేర పెరిగిన ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,84,900 వద్ద లభిస్తోంది. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు, వ్యాపారుల లాభాల శాతం ఆధారంగా నగరాల వారీగా ఈ ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసాలు ఉండవచ్చు. వినియోగదారులు కొనుగోలు చేసే ముందు స్థానిక నగల దుకాణాల్లో ధరలను సరిచూసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories