Gold Rates Crash: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Gold Rates Crash: హైదరాబాద్ పసిడి ప్రియులకు వరుసగా రెండో రోజు అదిరిపోయే శుభవార్త అందింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి.
Gold Rates Crash: హైదరాబాద్ పసిడి ప్రియులకు వరుసగా రెండో రోజు అదిరిపోయే శుభవార్త అందింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వేలల్లో ధరలు పతనం కావడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. నిన్న రూ. 1200 తగ్గగా, నేడు ఏకంగా రూ. 2 వేలకు పైగా పతనం కావడం విశేషం.22 క్యారెట్ల బంగారం హైదరాబాద్‌లో తులం (10 గ్రాములు) రూ. 2050 తగ్గి, ప్రస్తుతం రూ. 1,41,350 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 2240 మేర క్షీణించి, ప్రస్తుతం రూ. 1,54,200 కు చేరింది.
బంగారం దారిలోనే వెండి కూడా భారీగా తగ్గినప్పటికీ, నేడు మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరిలో రూ. 4.25 లక్షల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన వెండి, అక్కడి నుంచి ఏకంగా రూ. 1.60 లక్షల మేర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. గత 8 రోజులుగా వెండి ధర పెరగకపోవడం వెండి ప్రియులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కరోజే 100 డాలర్ల మేర తగ్గడం ప్రధాన కారణం. అమెరికా డాలర్ పుంజుకోవడంతో పాటు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు మారడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటల తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ, ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప వరమనే చెప్పాలి. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ పసిడి ప్రియులకు వరుసగా రెండో రోజు అదిరిపోయే శుభవార్త అందింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వేలల్లో ధరలు పతనం కావడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. నిన్న రూ. 1200 తగ్గగా, నేడు ఏకంగా రూ. 2 వేలకు పైగా పతనం కావడం విశేషం.22 క్యారెట్ల బంగారం హైదరాబాద్‌లో తులం (10 గ్రాములు) రూ. 2050 తగ్గి, ప్రస్తుతం రూ. 1,41,350 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 2240 మేర క్షీణించి, ప్రస్తుతం రూ. 1,54,200 కు చేరింది.
బంగారం దారిలోనే వెండి కూడా భారీగా తగ్గినప్పటికీ, నేడు మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరిలో రూ. 4.25 లక్షల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన వెండి, అక్కడి నుంచి ఏకంగా రూ. 1.60 లక్షల మేర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. గత 8 రోజులుగా వెండి ధర పెరగకపోవడం వెండి ప్రియులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కరోజే 100 డాలర్ల మేర తగ్గడం ప్రధాన కారణం. అమెరికా డాలర్ పుంజుకోవడంతో పాటు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు మారడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటల తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ, ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప వరమనే చెప్పాలి. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయంగా కనిపిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire