Gold Rates: గోల్డ్ ప్రియులకు గుడ్‌న్యూస్ ... బంగారం ధరల్లో తగ్గుదల

బంగారం ప్రేమికులకు శుభవార్త. పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇటీవల రోజుకొకలా మారుతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్న నేపథ్యంలో, ఈరోజు మాత్రం తులం గోల్డ్ ధర తగ్గడం ఊరటనిచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Dec 2025 11:23 AM IST
Gold Rates: గోల్డ్ ప్రియులకు గుడ్‌న్యూస్ ... బంగారం ధరల్లో తగ్గుదల
X

Gold Rates: గోల్డ్ ప్రియులకు గుడ్‌న్యూస్ ... బంగారం ధరల్లో తగ్గుదల

బంగారం ప్రేమికులకు శుభవార్త. పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇటీవల రోజుకొకలా మారుతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్న నేపథ్యంలో, ఈరోజు మాత్రం తులం గోల్డ్ ధర తగ్గడం ఊరటనిచ్చింది. అయితే వెండి మాత్రం భారీగా పెరిగి షాక్ ఇచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగింది.

బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.1,30,150 వద్ద ట్రేడ్ అవుతోంది.

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.1,19,300 వద్ద ఉంది.

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.410 తగ్గి రూ.97,610 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధర భారీగా పెరిగింది

కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.1,90,000 వద్ద అమ్ముడవుతోంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.1,99,000,

హైదరాబాద్‌లో రూ.1,95,900,

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.1,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గినా, వెండి ధరలు మాత్రం పెరుగుతూ వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story