Gold Rate Today : పసిడి ప్రేమికులకు ఊరట..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today
x

Gold Price Today March 10 2026

Highlights

Gold Rate Today : మార్చి 10న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులంపై రూ.2 వేలు, వెండిపై రూ.5 వేల వరకు తగ్గి, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,670 వద్ద కొనసాగుతోంది.

Gold Rate Today :పశ్చిమాసియాలో యుద్ధం, ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తూ బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై మొగ్గు చూపడం వల్ల ధరలు పెరుగుతాయి, కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు, లాభాల స్వీకరణ, డాలర్ బలపడటం వంటి కారణాలతో మంగళవారం మార్చి 10న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో తులం బంగారంపై దాదాపు 2 వేల రూపాయల వరకు తగ్గగా, వెండి ధర కూడా కిలోపై 5 వేల రూపాయల మేర భారీగా క్షీణించింది.

ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల పరిస్థితి పరిశీలిస్తే, హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,670 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,48,190 రూపాయల వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,61,820 రూపాయలుగా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర 1,48,340 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, బెంగళూరు, కేరళ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల బంగారం 1,61,670 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1,48,190 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక చెన్నైలో మాత్రం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉండి, 24 క్యారెట్ల తులం బంగారం 1,63,080 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,49,490 రూపాయల వద్ద విక్రయించబడుతోంది.

వెండి ధరల విషయానికొస్తే.. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ప్రస్తుతం కిలో వెండి ధర దేశవ్యాప్తంగా సగటున 2,79,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో స్థానిక పన్నులు, ఇతర కారణాల వల్ల వెండి ధర 2,89,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ధరలన్నీ మంగళవారం ఉదయం నమోదైన సమాచారం మేరకు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు, డాలర్ ఇండెక్స్ కదలికలను బట్టి రోజులో ధరలు ఎప్పుడైనా మారవచ్చని కొనుగోలుదారులు గమనించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories