Gold Special: బంగారానికి ఎందుకంత డిమాండ్? భవిష్యత్తులో ఇక బంగారాన్ని కొనలేమా?

Gold Special
x

Gold Special: బంగారానికి ఎందుకంత డిమాండ్? భవిష్యత్తులో ఇక బంగారాన్ని కొనలేమా?

Highlights

Gold Special: అత్యంత విలువైన లోహాల్లో ఒకటి.. బంగారం. కరెన్సీకి ప్రత్యామ్నాయం. ప్లాటినం వంటి విలువైన లోహాలు ఉన్నా.. బంగారంకే క్రేజ్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో కాస్త రేటు తగ్గినా దీని రేటు ఎప్పటికప్పుడు తగ్గేదేలే అంటూ పెరుగుతూ ఉంటుంది.

Gold Special: అత్యంత విలువైన లోహాల్లో ఒకటి.. బంగారం. కరెన్సీకి ప్రత్యామ్నాయం. ప్లాటినం వంటి విలువైన లోహాలు ఉన్నా.. బంగారంకే క్రేజ్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో కాస్త రేటు తగ్గినా దీని రేటు ఎప్పటికప్పుడు తగ్గేదేలే అంటూ పెరుగుతూ ఉంటుంది. జనం కూడా.. తగ్గకుండా బంగారాన్ని కొంటూ ఉంటారు. అసలు ఇంతకీ ఈ బంగారానికి ఎందుకింత డిమాండ్? భవిష్యత్తులో బంగారాన్ని మనమింక కొనలేమా..?

ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా బంగారం పైనున్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు పెట్టుబడుదారులు కూడా. బంగారాన్ని మించిన సురక్షితమైన పెట్టుబడి మరొకటి లేదని భావిస్తారు. అందుకే దాని రేటు పెరుగుతున్నా తగ్గేదేలే అంటూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో బంగారాన్ని మించి ఉన్న లోహాలెన్నో ఉన్నాయి. కానీ ఈ బంగారానికే క్రేజ్ ఎక్కువ.

ఎందుకంత డిమాండ్?

సాధారణంగా కరెన్సీ విషయానికొస్తే.. ఏ దేశ కరెన్సీని ఆ దేశంలోనే వినియోగించాలి. అమెరికా డాలర్ ను మాత్రమే ఇతర దేశాల్లో అనుమతిస్తారు. అయితే బంగారం విషయంలో అలా కాదు. ఏ దేశం వెళ్లినా బంగారంతో లావాదేవీలు చేయొచ్చు. అందుకే విదేశాలకు వెళ్లేవారు, వచ్చేవాళ్లు బంగారాన్ని కరెన్సీకి ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ పెరుగుతూ వెళుతుంది. అలాగే ఇతర లోహాలు తుప్పు పట్టినట్టు బంగారం తుప్పుపట్టదు

ఇతర లోహాలేంటి?

ప్లాటినం, పెలాడియం వంటి లోహాలు కూడా చాలా విలువైనవే. కానీ వీటికి.. బంగారానికి ఉన్న పాపులారిటీ లేదు. అంత డిమాండూ లేదు. మరి బంగారానికే ఎందుకంత డిమాండ్ అంటే..? వందల ఏళ్ల నుంచీ ప్రజలకు బాగా తెలిసిన లోహం. ప్రాచీనకాలం నుంచే బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఎందుకంటే.. ఆ కాలంలో కరెన్సీ ఉండేది కాదు కదా. అందుకు.. కరెన్సీ స్థానంలో బంగారం కాయిన్లను ఉపయోగించేవారు.

నిజమైన బంగారాన్ని ఎలా గుర్తించాలి?

బంగారమనేది ఒక రసాయనం. స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించాలంటే అది కాస్త ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది. దానిలో రాగి, వెండి, ఇతర లోహాలు కలుపుతారు కాబట్టి దానికి ఈ రంగు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారాన్ని ఫైన్నెస్ లేదా కారెట్లలో కొలుస్తారు. బంగారం పైన్నెస్‌ అయితే వెయ్యిలో వంతుగా లెక్కిస్తారు. ఉదాహరణకు పైన్నేస్ 885 అంటే అందులో బంగారం కూడా 885 వంతులే ఉంటుంది. అయితే మిగిలిన 115 వంతులు వెండి, రాగి వంటి ఇతరలోహాలు ఉంటాయి. అలాగే 24 కారెట్లు అనేది, కల్తీలేని స్వచ్ఛమైన బంగారానికి సూచిక. ఉదాహరణకు 22 కారెట్ల బంగారం అంటే, అందులో బంగారం 22 భాగాలు, మిగిలిన 2 భాగాలు రాగి, లేదా వెండి వంటివి ఉంటాయి.

బంగారం రేట్లలో మార్పులు ఎలా వస్తాయి?

బంగారంలో వచ్చే మార్పుల్లానే..దాని రేటులో కూడా మార్పులు ఉంటాయి. బంగారం రేటు ఈమధ్య కాలంలోనే ఎక్కువగా పెరిగింది. అయితే దీనికి కారణం.. బంగారం మైనింగ్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టాల్సి రావడం. దీనివల్ల తవ్వకాలు తగ్గిపోతున్నాయి. దీంతొ ఉత్పత్తి తగ్గిపోతుంది. 1925లో ఒక గ్రాము బంగారం ధర 18 రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది లక్ష రూపాయల వరకు ఉంది. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లలో మార్పులు వచ్చినప్పుడూ బంగారం రేటు పెరుగుతూ,తగ్గుతూ ఉంటుంది.

భవిష్యత్తులో కొనలేమా?

గత కొన్నేళ్లుగా పసిడి ధర పెరుగుతూనే ఉంది. ఈ వారం రోజుల్లో మాత్రమే బంగారం కాస్త తగ్గింది. అయితే భవిష్యత్తులో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకానొక స్థాయికి వెళ్లే సరికి బంగారం ఉత్పత్తి బాగా తగ్గిపోవచ్చు. ఎందుకంటే భూమి క్రస్ట్ లలో కేవలం 55వేల టన్నుల బంగారం మాత్రమే నిల్వ ఉందని జువాలజిస్టులు చెబుతున్నారు. అంటే ఒక ఇరవై సంవత్సరాల పాటు మైనింగ్ కొనసాగినా.. ఆ తర్వాత కష్టమంటున్నారు. దీంతో ఇక ఆ తర్వాత బంగారం కొనాలనుకుంటే.. ఒకరి నుంచి ఒకరికి బదిలీ మాత్రమే కావాలి తప్ప మార్కెట్లో కొత్త బంగారం దొరికే అవకాశం తక్కువ ఉండొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories