LIC Good News: ఎల్​ఐసీ గుడ్​న్యూస్​.. ఇప్పుడు వీరికి మరింత ఉత్సాహం.. మరింత లాభం..!

Good News For LIC Agents And Employees Gratuity Limit Increase Family Pension Facility
x

LIC Good News: ఎల్​ఐసీ గుడ్​న్యూస్​.. ఇప్పుడు వీరికి మరింత ఉత్సాహం.. మరింత లాభం..!

Highlights

LIC Good News: ఎల్​ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. అన్ని వర్గాల వారికి అనుకూలమైన పాలసీలని రూపొందిస్తుంది.

LIC Good News: ఎల్​ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. అన్ని వర్గాల వారికి అనుకూలమైన పాలసీలని రూపొందిస్తుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంటోంది. ఇప్పుడు ఉద్యోగులు, ఏజెంట్లకు కూడా వరాల జల్లు కురిపించింది. గ్రాట్యుటీ పరిమితి, ఏజెంట్ల పునరుద్ధరణ కమీషన్, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ, కుటుంబ పెన్షన్ పెంపు వంటి తదితర చర్యలు చేపట్టింది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్​లో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 13 లక్షలకు పైగా ఏజెంట్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీరందరు మరింత రెట్టింపుతో పనిచేస్తారు. కొత్తగా ఎల్‌ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. దీని కారణంగా ఈ సంస్థలో పని చేస్తున్న13 లక్షల మంది ఏజెంట్లకు లబ్ధి చేకూరనుంది. తిరిగి నియమించిన ఏజెంట్లకు పాత పాలసీ వ్యాపారంపై పునరుద్ధరణ కమీషన్ కూడా చెల్లిస్తోంది.

అలాగే ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ కింద 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచింది. 25,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు కవరేజీ అందిస్తోంది. ఎల్‌ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్‌ఐసీ ఇప్పటికీ భారతదేశంలో అతిపెద్ద జీవిత బీమా కంపెనీగా రికార్డును కలిగి ఉంది. అనేక మార్కెట్​లో చాలాప్రైవేట్ బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఇప్పటికి ఎల్ఐసీ నెంబర్​ వన్​గా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories