Aadhaar : ఏకంగా 2.5కోట్ల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన మోదీ సర్కార్.. మీది ఉందేమో చెక్ చేస్కోండి

Aadhaar : ఏకంగా 2.5కోట్ల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన మోదీ సర్కార్.. మీది ఉందేమో చెక్ చేస్కోండి
x
Highlights

ఏకంగా 2.5కోట్ల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన మోదీ సర్కార్.. మీది ఉందేమో చెక్ చేస్కోండి

Aadhaar : కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆధార్ డేటాబేస్‌ను ప్రక్షాళన చేసే క్రమంలో ఏకంగా 2.5 కోట్ల ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలో అత్యంత కీలక గుర్తింపు కార్డు అయిన ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఆధార్ డేటాబేస్ విశ్వసనీయతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల ఆధార్ కార్డులను కేంద్రం రద్దు చేసింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. రద్దు చేసిన కార్డులన్నీ మరణించిన వ్యక్తుల పేర్ల మీద ఉన్నవని, వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఎందుకు ఈ నిర్ణయం?

ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉంటే, దాని ద్వారా చాలా ప్రమాదాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరణించిన వారి ఆధార్‌ను ఉపయోగించి బ్యాంక్ ఖాతాలు తెరవడం, సిమ్ కార్డులు తీసుకోవడం లేదా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అక్రమంగా పొందడం వంటి మోసాలు జరుగుతున్నాయి. ఈ ముప్పును తప్పించేందుకు, మరణించిన వారి డేటాను ఆధార్ డేటాబేస్ నుంచి తొలగించడం తప్పనిసరి అని అధికారులు భావించారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 134 కోట్ల మందికి పైగా యాక్టివ్ ఆధార్ కార్డు దారులు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థను అప్‌డేట్‌గా ఉంచడం ఒక సవాలుతో కూడుకున్న పని అని మంత్రి తెలిపారు.

సాంకేతిక భద్రత.. కొత్త రూల్స్

ఆధార్ వ్యవస్థను మరింత సురక్షితం చేసేందుకు ప్రభుత్వం అనేక సాంకేతిక మార్పులు చేస్తోంది. కేవలం కార్డులు రద్దు చేయడమే కాకుండా, బతికున్న వారికి కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్‎లో లైవ్‌నెస్ డిటెక్షన్ అనే ఫీచర్‌ను చేర్చారు. అంటే, కెమెరా ముందు ఉన్న వ్యక్తి నిజంగా అక్కడే ఉన్నాడా లేక ఫొటో చూపిస్తున్నారా అనేది ఈ సాంకేతికత గుర్తిస్తుంది. అలాగే, ప్రజలు తమ బయోమెట్రిక్స్‌ను (వేలిముద్రలు, కనుపాప సమాచారం) లాక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఆధార్ డేటాను వాడలేరు.

కుటుంబ సభ్యులకు కొత్త యాప్

మరణించిన వారి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయడం ఇప్పుడు మరింత సులభమైంది. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆధార్ యాప్‌ను కూడా ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే, ఆ విషయాన్ని వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. గతంలో మరణాల నమోదు ఒక చోట, ఆధార్ చిరునామా మరో చోట ఉండటం వల్ల డేటాను అనుసంధానం చేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అన్ని డేటాబేస్‌లను ఒకదానితో ఒకటి కలిపి, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories