వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట.. గ్యాస్ సిలిండర్‌పై 200 సబ్సిడి..

Govt Extends ₹200 Subsidy on LPG Cylinder Under Ujjwala Scheme
x

వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట.. గ్యాస్ సిలిండర్‌పై 200 సబ్సిడి..

Highlights

LPG Gas Subsidy 2023: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట కలిగించింది.

LPG Gas Subsidy 2023: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరట కలిగించింది. గ్యాస్ సిలిండర్‌పై 2 వందల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 వందల రూపాయల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్లు వినియోగిస్తున్న లబ్ధిదారులకు ఈ రాయితీ వర్తించనుంది. కేంద్రం ప్రకటించిన రాయితీతో 9 కోట్ల 6 లక్షల పేద మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. కేంద్రం ప్రకటించిన ఈ రాయితీ మరో ఏడాది పాటు వర్తించనుంది. మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories