Business Man: ఫండింగ్ లేకుండా ఇండియాలో అతిపెద్ద షూకంపెనీని నిర్మించిన ఇతని గురించి తెలుసా? ఏకంగా క్రికెట్‌ గాడ్‌ ప్రచారం చేసిన బ్రాండ్!

Hari Krishna Agarwal Journey Founder of India Largest Shoe Company Sachin Tendulkar Endorse
x

Business Man: ఫండింగ్ లేకుండా ఇండియాలో అతిపెద్ద షూకంపెనీని నిర్మించిన ఇతని గురించి తెలుసా? ఏకంగా క్రికెట్‌ గాడ్‌ ప్రచారం చేసిన బ్రాండ్!

Highlights

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ క్యాంపస్ షూస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ఇప్పుడు ఈ కంపెనీ ఇతర దేశాల్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

Success Story of Hari Krishan Agarwal: హరి కృష్ణ అగర్వాల్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు వ్యాపార అనుభవం లేదు కానీ.. చిన్న వయస్సులోనే వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకున్నారు. 1983లో 'యాక్షన్' అనే బ్రాండ్ కింద స్పోర్ట్స్ షూస్ విక్రయించడం మొదలుపెట్టారు. హరి వ్యాపార ప్రయాణం అక్కడే ప్రారంభమైంది. 1991లో ఇండియాలో విదేశీ కంపెనీలకు డోర్లు ఓపెన్ చేసినప్పుడు నైక్, అడిడాస్, పూమా లాంటి గ్లోబల్ బ్రాండ్స్ ఇండియాలోకి వచ్చాయి. అయితే వాటి షూస్ ధరలు చాలా భారీగా ఉండేవి. ఈ సమస్యను గమనించిన అగర్వాల్ 2005లో 'క్యాంపస్ షూస్'ను ప్రారంభించారు. ఇది చీప్‌ అండ్‌ బెస్ట్‌లో మంచి స్పోర్ట్స్ షూగా ఫేమస్ అయ్యింది. ఈ షూ మార్కెట్‌లోకి విడుదలైన తొలి రోజే కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ప్రస్తుతానికి 1,000 రూపాయల కేటగరీలో 48శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.

నిజానికి క్యాంపస్ యాక్టివ్వేర్ ఇప్పుడు నైక్, అడిడాస్, పూమా లాంటి గ్లోబల్ బ్రాండ్స్‌ను మించి ఇండియాలో నంబర్ 1 షూబ్రాండ్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌ట్స్‌తో పాటు 35 ఎక్స్‌క్లూసివ్ స్టోర్స్ ఉన్నాయి. ఇండియాలో 5 మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 1.5 కోట్ల జతల షూస్‌లు విక్రయిస్తున్నారు. సచిన్ టెండుల్కర్, వరుణ్ ధవన్ లాంటి సెలబ్రిటీలు ఈ బ్రాండ్‌కు ప్రచారం చేశారు.

ఇక అన్నిటికంటే అదిరిపోయే విషయం ఒకటుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ క్యాంపస్ షూస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. సచిన్ టెండుల్కర్ మద్దతు ఈ బ్రాండ్‌కు భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. సచిన్ టెండుల్కర్ ఇండియాలో ప్రతి ఇంట్లోనూ వినిపించే పేరు. అతనంటే ఇష్టపడని వారు చాలా కొద్దీ మందే ఉంటారు. సచిన్ టెండుల్కర్ ప్రచారం చేసిన తర్వాత, క్యాంపస్ షూస్‌ సేల్స్‌ భారీగా పెరిగాయి

ఇక 2022లో క్యాంపస్ యాక్టివ్వేర్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. దీని IPO 23శాతం ఎక్కువ ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇది హరి కృష్ణ అగర్వాల్ నెట్‌వర్త్‌ను పెంచింది. ఫోర్బ్స్ ప్రకారం, ఆయన ప్రస్తుత నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లు. ఈ IPO విజయం క్యాంపస్ యాక్టివ్వేర్‌కు ఇంకా పెద్ద స్థాయిలో విస్తరించడానికి అవకాశం కల్పించింది. మరోవైపు 2023లో క్యాంపస్ యాక్టివ్వేర్ ఇండోనేషియా, మలేషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించింది. ఇది క్యాంపస్ యాక్టివ్వేర్ యొక్క గ్లోబల్ అంబిషన్‌ను చాటుకుంది. ఇండియాలో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఈ కంపెనీ ఇతర దేశాల్లో కూడా తన పాదముద్రను పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇటు ఈ కంపెనీని హరి కృష్ణ అగర్వాల్ కుమారుడు నిఖిల్ అగర్వాల్ నిర్వహిస్తున్నారు. ఆయన ఇండస్ట్రియల్ ఇంజనీర్ మరియు కంపెనీ సీఈఓగా పని చేస్తున్నారు. నిఖిల్ అగర్వాల్ నాయకత్వంలో క్యాంపస్ యాక్టివ్వేర్ ఇంకా పెద్ద స్థాయిలో విస్తరించడానికి సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories