HDFC Bank: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

HDFC Bank
x

HDFC Bank: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

Highlights

HDFC Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ, దేశీ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది.

HDFC Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ, దేశీ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన లోన్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లోన్ రేట్ల పెంపు.. అమల్లోకి కొత్త ధరలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ కొత్త రేట్లు 2026, ఫిబ్రవరి 7 నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు తీసుకునే వారికి ఈ భారం పడనుంది.

ఏ టెన్యూర్‌పై ఎంత పెరిగింది?

బ్యాంక్ అన్ని రకాల కాలపరిమితులపై రేట్లను పెంచకుండా, కేవలం మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌ను సవరించింది. ఇదివరకు 8.55 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 8.60 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ రేటు 8.25%, మూడు నెలల రేటు 8.30%, ఏడాది కాలపరిమితి రేటు 8.40% వద్ద స్థిరంగా ఉన్నాయి.

ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీ రేటు. దీని పెంపు వల్ల పాత రుణ గ్రహీతల ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి కన్జూమర్ లోన్లు, పర్సనల్ లోన్లకు ఈ రేట్లు కీలకం. లోన్ రేట్లు పెరిగినప్పటికీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో బ్యాంక్ ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 6.45 శాతం, సీనియర్ సిటిజెన్లకు 6.95 శాతం వడ్డీ లభిస్తోంది. ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచిన తరుణంలో, హెచ్‌డీఎఫ్‌సీ తీసుకున్న ఈ నిర్ణయం రుణాలు తీసుకునే మధ్యతరగతి ప్రజలకు కాస్త చేదు వార్తే అని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories