HDFC Bank TRV Rule : అక్టోబర్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు కొత్త మార్పులు

HDFC TRV రూల్ : అక్టోబర్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు కొత్త మార్పులు
x

HDFC TRV రూల్ : అక్టోబర్ 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు కొత్త మార్పులు

Highlights

మీరు HDFC బ్యాంక్ కస్టమర్ అయితే ఇది మీకోసమే. త్వరలోనే ఒక ముఖ్యమైన రూల్ అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే బ్యాంక్ తన కస్టమర్లకు ఈ మార్పులపై ఇ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్‌లు పంపుతోంది.

మీరు HDFC బ్యాంక్ కస్టమర్ అయితే ఇది మీకోసమే. త్వరలోనే ఒక ముఖ్యమైన రూల్ అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే బ్యాంక్ తన కస్టమర్లకు ఈ మార్పులపై ఇ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్‌లు పంపుతోంది.

కొత్త TRV రూల్ వివరాలు :

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రీమియం ఇంపీరియా ప్రోగ్రామ్ కోసం అర్హత ప్రమాణాలను సవరించింది.

ఇకపై టోటల్ రిలేషన్‌షిప్ వాల్యూ (TRV) రూ.1 కోటి ఉండాలి.

ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.

TRV (Total Relationship Value) అంటే ఏమిటి?

కస్టమర్ లేదా వారి కుటుంబం బ్యాంకుతో కలిపి కలిగిన మొత్తం విలువ TRVగా లెక్కిస్తారు. ఇందులో :

సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలోని డబ్బు

బ్యాంక్ ద్వారా కొనుగోలు చేసిన మ్యూచువల్ ఫండ్లు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్టులు

బ్యాంకు ఇచ్చిన రిటైల్ లోన్లలో 20% విలువ

డీమ్యాట్ హోల్డింగ్స్‌లో 20%

బ్యాంక్ ద్వారా కొనుగోలు చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా చేరతాయి.

కొత్త అర్హత ప్రమాణాలు :

కరెంట్ అకౌంటులో కనీసం క్వార్టర్లీ సగటు రూ.15 లక్షలు

సేవింగ్స్ అకౌంటులో నెలవారీ సగటు రూ.10 లక్షలు

సేవింగ్స్ + కరెంట్ + FD కలిపి నెలవారీ సగటు రూ.30 లక్షలు

లేదా నెలవారీ జీతం రూ.3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అయితే కూడా అర్హత.

ఎవరికి వర్తిస్తుంది?

జూన్ 30, 2025కి ముందు ఇంపీరియా ప్రోగ్రామ్‌లో చేరిన వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ వర్తిస్తాయి.

జూలై 1, 2025 తర్వాత చేరిన కస్టమర్లకు ఇప్పటికే కొత్త రూల్స్ వర్తిస్తున్నాయి.

ఇంపీరియా కస్టమర్లకు లభించే సౌకర్యాలు :

ఇంటర్ బ్రాంచ్ ఫండ్ ట్రాన్స్ఫర్, చెక్ కలెక్షన్, మాండేట్ రిజిస్ట్రేషన్, పాత స్టేట్‌మెంట్‌లు వంటి అనేక సేవలు ఉచితంగా లభిస్తాయి.

లాకర్ ఫెసిలిటీ : ఒక లాకర్ పూర్తిగా ఉచితం, అదే గ్రూపులో రెండో లాకర్‌పై 50% అద్దె తగ్గింపు.

మీరు ఇంపీరియా కస్టమర్ అయితే, మీ అకౌంట్ బ్యాలెన్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్ చెక్ చేసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories