Paneer: కల్తీతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..అసలు, కల్తీ పనీర్‌ను ఎలా గుర్తించాలి?

Paneer: కల్తీతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..అసలు, కల్తీ పనీర్‌ను ఎలా గుర్తించాలి?
x

Paneer: కల్తీతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..అసలు, కల్తీ పనీర్‌ను ఎలా గుర్తించాలి?

Highlights

Paneer: పనీర్ భారతదేశంలో అత్యంత ఇష్టమైన, ఎక్కువగా వినియోగించే ఆహార పదార్థాలలో ఒకటి. సాధారణ వంటల నుంచి పండుగ వేడుకల వరకు, పనీర్ తప్పనిసరిగా ఉంటుంది.

Paneer: పనీర్ భారతదేశంలో అత్యంత ఇష్టమైన, ఎక్కువగా వినియోగించే ఆహార పదార్థాలలో ఒకటి. సాధారణ వంటల నుంచి పండుగ వేడుకల వరకు, పనీర్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారులకు ఇది పోషకాల గని. అయితే భారతదేశంలో కలవరపెడుతున్న విషయం ఏమిటంటే.. పనీర్ కల్తీ విపరీతంగా పెరగడం. మార్కెట్‌లో అమ్ముడవుతున్న పనీర్‌లో చాలా వరకు నకిలీదని, ఇది పచ్చి పాలతో కాకుండా, చవకైన ముడి పదార్థాలైన స్టార్చ్, కూరగాయల నూనెలు, కొన్ని సందర్భాల్లో హానికరమైన రసాయనాలతో కూడా తయారవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కల్తీ పనీర్ పెరుగుదల వినియోగదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

నకిలీ పనీర్ తయారీలో వాడుతున్న పదార్థాలు

పలు భారతీయ రాష్ట్రాల్లోని స్థానిక ఆరోగ్య విభాగాలు ప్రస్తుతం పనీర్ కల్తీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది నెలల్లో నిర్వహించిన దాడులు, తనిఖీలలో, మార్కెట్ల నుంచి సేకరించిన పనీర్ నమూనాలలో యాభై శాతం కంటే ఎక్కువ భద్రతా ప్రమాణాలను, స్వచ్ఛత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. కల్తీ పనీర్ తయారీలో అధికారులు గుర్తించిన కొన్ని హానికరమైన పదార్థాలు శుద్ధి చేసిన కూరగాయల నూనెలు, హైడ్రోజనేటెడ్ కొవ్వులు, స్టార్చ్ సగ్గుబియ్యం, సింథటిక్ వైట్నర్లు (రంగు కోసం ఉపయోగించే రసాయనాలు), తక్కువ నాణ్యత గల పాల పొడి , హానికరమైన పాలు విరగ్గొట్టే పదార్థాలు. తయారీదారులు ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడానికి ఈ కృత్రిమ పదార్థాలను వాడుతున్నప్పటికీ, ఇవి రుచి, పోషణ, స్వచ్ఛత, ఆరోగ్యం అనే నాలుగు ముఖ్య అంశాలను దెబ్బతీస్తాయి.

నకిలీ పనీర్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు

కల్తీ పనీర్ లేదా కృత్రిమ పనీర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది:

జీర్ణ సమస్యలు : పనీర్‌లో ఉండే అధిక స్టార్చ్ కంటెంట్ కారణంగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ మరియు జీర్ణ సమస్యలు వస్తాయి.

దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు: హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు.

టాక్సిన్స్ ప్రభావం: కల్తీ పనీర్‌లో ఉపయోగించే తప్పుడు రసాయనాలు రక్తాన్ని ఫిల్టర్ చేసే ముఖ్యమైన అవయవాలైన కాలేయం, మూత్రపిండాలకు, తీవ్రంగా హాని కలిగించవచ్చు.

తక్కువ పోషక విలువలు: నకిలీ పనీర్‌లో పాలు, కాల్షియం ఉండవు. అందుకే పనీర్ తినాలనే ముఖ్య ఉద్దేశం నెరవేరదు. ఈ కల్తీ పనీర్ పిల్లలకు, పాలిచ్చే తల్లులకు, వృద్ధులకు మరింత ప్రమాదకరం.

కల్తీని గుర్తించడానికి సులభమైన పరీక్షలు

మీరు కొనుగోలు చేసిన పనీర్ కల్తీ అయిందో లేదో సులభంగా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు ఇక్కడ ఉన్నాయి:

ఐయోడిన్ టెస్ట్: పనీర్ ముక్కపై కొన్ని చుక్కల అయోడిన్‌ను వేయండి. ప్రతిచర్య రంగును గమనించండి. మొత్తం ముక్క నీలం-నలుపు రంగులోకి మారితే, అందులో స్టార్చ్ ఉన్నట్లు లెక్క.

టెక్ఛర్ పరీక్ష : స్వచ్ఛమైన పనీర్ మెత్తగా, కాస్త గరుకుగా, గట్టిగా ఉంటుంది. నకిలీ పనీర్ రబ్బరులా లేదా జిడ్డుగా అనిపిస్తుంది.

వంట పరీక్ష : స్వచ్ఛమైన పనీర్ వంట చేసేటప్పుడు విరిగిపోకుండా లేదా కరిగిపోకుండా చెదిరిపోకుండా ఉంటుంది. నకిలీ పనీర్ విరిగిపోతుంది లేదా అధికంగా కరిగిపోతుంది.

స్మెల్ టెస్ట్ : నిజమైన పనీర్ తాజా పాల సువాసనను కలిగి ఉంటుంది. నకిలీ పనీర్ నూనె లేదా కృత్రిమ, ఘాటైన వాసనను కలిగి ఉండవచ్చు.

స్వచ్ఛతను తిరిగి తెస్తున్న Kine Milk

కల్తీ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో నేటి వినియోగదారులు ప్యాకేజ్డ్ పనీర్‌ను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది సురక్షితమైనది, పరిశుభ్రమైన ప్యాకేజింగ్‌తో స్థిరంగా తయారు చేయబడింది. పోషకపరంగా సరైనది. కల్తీ తీవ్రతరం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో Kine Milk వంటి లేటెస్ట్ బ్రాండ్‌లు వినియోగదారులలో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి ముందుకు వచ్చాయి. ఈ బ్రాండ్ పొలం నుంచి నేరుగా, స్వచ్ఛమైన, తాజా పాలతో తయారు చేసిన పనీర్‌ను అందిస్తామని హామీ ఇస్తుంది. Kine Milk పనీర్ రసాయనాలు లేని, పరిశుభ్రమైన పరిస్థితుల్లో సేకరించిన పాల నుంచి తయారవుతుంది. Kine Milk పనీర్‌లో స్టార్చ్, కూరగాయల నూనెలు లేదా కృత్రిమ బ్లీచర్‌లను ఉపయోగించరు. ఇది స్వచ్ఛమైన రుచి, ఆకృతి, ప్రోటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్రాండ్ ఉష్ణోగ్రత నియంత్రణలో నాణ్యత తనిఖీలతో, అత్యంత సురక్షితమైన ఆహార తయారీ పద్ధతులను అనుసరిస్తుంది. సురక్షితం కాని ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న మార్కెట్లో ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని కోరుకునే కుటుంబాలకు Kine Milk పనీర్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

మరిన్ని వివరాల కోసం: https://kinemilk.com/ ను సందర్శించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories