Heritage Shares: ఏపీ సీఎం సతీమణికి ఒక్కరోజే రూ.78 కోట్ల లాభం.. 7 శాతానికి పైగా ఎగసిన హెరిటేజ్ స్టాక్

Heritage Shares: ఏపీ సీఎం సతీమణికి ఒక్కరోజే రూ.78 కోట్ల లాభం.. 7 శాతానికి పైగా ఎగసిన హెరిటేజ్ స్టాక్
x

Heritage Shares: ఏపీ సీఎం సతీమణికి ఒక్కరోజే రూ.78 కోట్ల లాభం.. 7 శాతానికి పైగా ఎగసిన హెరిటేజ్ స్టాక్

Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఒక్క రోజులోనే భారీ లాభాలను అందుకున్నారు. ఆమెకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods Ltd) కంపెనీ షేరు ధర శుక్రవారం 7 శాతం పైగా పెరగడంతో, ఆమెకు సుమారు రూ.78.80 కోట్ల లాభం వచ్చినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఒక్క రోజులోనే భారీ లాభాలను అందుకున్నారు. ఆమెకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods Ltd) కంపెనీ షేరు ధర శుక్రవారం 7 శాతం పైగా పెరగడంతో, ఆమెకు సుమారు రూ.78.80 కోట్ల లాభం వచ్చినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ హెరిటేజ్ స్టాక్ మాత్రం బలంగా ట్రేడైంది.

భువనేశ్వరి ప్రస్తుతం ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా ఉన్నారు. ఆమెకు కంపెనీలో 24.37 శాతం వాటా ఉంది, అంటే 2,26,11,525 షేర్లు. నారా చంద్రబాబు నాయుడు 1992లో స్థాపించిన ఈ కంపెనీకి ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా వాటాదారు.

హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు, వ్యాపార విస్తరణ

హెరిటేజ్ ఫుడ్స్ దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపారం చేస్తోంది. రోజుకు 28.7 లక్షల లీటర్ల పాలు ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. 418 రకాల డైరీ ఉత్పత్తులు తయారు చేస్తోంది. డైరీతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ, ఆహార ఉత్పత్తుల రంగాల్లో కూడా కార్యకలాపాలను విస్తరించింది.

త్రైమాసిక ఫలితాలు

2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కంపెనీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,136.8 కోట్లకు చేరింది. అయితే నికర లాభం మాత్రం 30.7 శాతం తగ్గి రూ.40.05 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో రూ.58.4 కోట్ల లాభం సాధించింది.

పాల సేకరణ: రోజుకు 17.8 లక్షల లీటర్లు (9.9% వృద్ధి)

పాల విక్రయాలు: 2.8% వృద్ధి

వర్షాల ప్రభావం డిమాండ్, సరఫరాపై పడటంతో లాభాలు తగ్గాయని కంపెనీ తెలిపింది.

మార్కెట్ ప్రదర్శన

హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.4,560 కోట్ల వద్ద ఉంది.

PE రేషియో: 24.24

52 వారాల కనిష్ఠ ధర: రూ.352

ప్రస్తుత ధర: రూ.492 (38% వృద్ధి)

52 వారాల గరిష్ఠం: రూ.659

విజన్ 2030 లక్ష్యం

హెరిటేజ్ ఫుడ్స్ "విజన్ 2030" ద్వారా దేశంలో టాప్ డైరీ న్యూట్రిషన్ బ్రాండ్లలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories