Unclaimed Money in Indian Banks: దేశ బ్యాంకుల్లో క్లైమ్‌ చేయని డబ్బు ఎంత ఉంది..?

Unclaimed Money in Indian Banks: దేశ బ్యాంకుల్లో క్లైమ్‌ చేయని డబ్బు ఎంత ఉంది..?
x

Unclaimed Money in Indian Banks: దేశ బ్యాంకుల్లో క్లైమ్‌ చేయని డబ్బు ఎంత ఉంది..?

Highlights

దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో చాలా కాలంగా డబ్బులు పేరుకుపోయాయి, వాటిని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు.

Unclaimed Money in Indian Banks: దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో చాలా కాలంగా డబ్బులు పేరుకుపోయాయి, వాటిని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు. చాలా కుటుంబాలు, పెట్టుబడిదారులు తమ పూర్వీకులు లేదా పాత పెట్టుబడులు ఎక్కడ చిక్కుకున్నాయో ఇంకా తెలుసుకోలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కొంతకాలం క్రితం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం కింద, ప్రభుత్వం లక్ష్యం ఏ కుటుంబానికి చెందిన అన్‌క్లైమ్డ్‌ డబ్బులను ఆయా కుటుంబాలకు చేర్చడం. కాబట్టి, బ్యాంక్ లలో ఎంత అన్ క్లెయిమ్డ్ డబ్బు ఉందో, ఈ మొత్తం ఏయే రంగాలలో చిక్కుకుందో ఇప్పుడు చూద్దాం.

తాజా ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు రూ. 1.84 లక్షల కోట్లు అన్ క్లెయిమ్డ్ గా ఉన్నాయి. ఇది బ్యాంకుల్లోనే కాకుండా బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ వంటి అనేక రంగాలలో చిక్కుకుపోయింది. ఈ మొత్తంలో ఎక్కువ భాగం ఇప్పటివరకు RBI, ఇతర నియంత్రణ సంస్థల వద్ద భద్రంగా ఉంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ క్లెయిమ్డ్ డబ్బును తిరిగి ఇవ్వడానికి ఆప్కీ పూంజీ ఆప్కా అధికార్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం లక్ష్యం ప్రజలకు వారి డబ్బును తిరిగి ఇవ్వడం. ఈ ప్రచారం 3 నెలల పాటు అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో, ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ ఉద్యోగులు క్లెయిమ్ చేయని డబ్బును వారి సరైన యజమానులకు చేరేలా చూస్తారు.

బ్యాంకులలో అన్ క్లెయిమ్డ్ డబ్బును ప్రజలకు తిరిగి ఇచ్చే ప్రక్రియను సులభతరం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UDGAM పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా, ప్రజలు తమ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న పాత ఖాతాలు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లలో చిక్కుకున్న డబ్బు గురించి సమాచారాన్ని పొందవచ్చు. పోర్టల్ లో నమోదు చేసుకున్న తర్వాత, ఏదైనా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ కనుక్కుంటే, సంబంధిత బ్యాంకు లేదా సంస్థలో డాక్యుమెంట్లు సమర్పించి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.

UDGAM పోర్టల్ లో క్లెయిమ్ చేయడానికి, మీరు మొదట ఈ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.

దీని తరువాత, మీ పేరు, గుర్తింపు కార్డుతో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ లేదా రంగాన్ని ఎంచుకుని సెర్చ్ చేయాలి. దీని తరువాత, మీ డబ్బు కనుక్కుంటే, మీరు సంబంధిత బ్యాంకు లేదా సంస్థకు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించి మీ డబ్బును పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories