Business Idea: అవును ఈ చెట్ల‌కు నిజంగానే డ‌బ్బులు కాస్తాయి.. బెస్ట్ బిజినెస్ ఐడియా

Business Idea: అవును ఈ చెట్ల‌కు నిజంగానే డ‌బ్బులు కాస్తాయి.. బెస్ట్ బిజినెస్ ఐడియా
x
Highlights

Business Idea: చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం చేసి, కొంత డబ్బు వెనకేసుకుని తర్వాత వ్యాపారం ప్రారంభించాలనేది చాలా మందిలో ఉండే ఆలోచన. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

Business Idea: చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం చేసి, కొంత డబ్బు వెనకేసుకుని తర్వాత వ్యాపారం ప్రారంభించాలనేది చాలా మందిలో ఉండే ఆలోచన. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, నేరుగా వ్యాపారంలోకి అడుగుపెట్టే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వాస్తవానికి, చదువు, ఉద్యోగం సంబంధం లేకుండా వ్యాపారం చేసి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం నష్టాల భయంతో వ్యాపారం వైపు ముందడుగు వేయడం లేదు. కానీ మార్కెట్ అవసరాలు, నూతన టెక్నాలజీతో సాగును ప్లాన్ చేస్తే గ్యారంటీగా లాభాలే వస్తాయి.

అలాంటి లాభదాయకమైన వ్యాపారాల్లో "నిమ్మ సాగు ఒక‌టి. ఏ కాలమైనా సరే... నిమ్మకాయల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ ధర సుమారు ₹5 ప‌లుకుతోంది. అలాంటప్పుడు ఈ సాగు ఎంత లాభదాయకమో ఊహించొచ్చు.

నిమ్మ సాగు ఎలా మొదలుపెట్టాలి?

ముందుగా ఈ సాగు కోసం కొంత భూమి అవసరం.

ఒక ఎకరాలో సుమారు 100 నిమ్మ మొక్కలు నాటవచ్చు.

ఒక్కో నిమ్మ మొక్క ధర సుమారు ₹30 ఉంటుంది.

నిమ్మ మొక్కలకు తక్కువ నీరే సరిపోతుంది. ఇతర పంటలతో పోల్చితే ఈ సాగుకు నిర్వహణ ఖర్చు తక్కువ.

దిగుబడి ఎప్పుడొస్తుంది?

నాటిన కనీసం 3 ఏళ్ల తర్వాతే దిగుబ‌డి వ‌స్తుంది. ఆ తర్వాత మాత్రం ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఒక్క చెట్టు నుంచి ఏడాదికి సుమారుగా 500 కిలోల వరకు నిమ్మకాయలు తీసుకోవచ్చు.

సీజన్‌ను బట్టి ఏడాదికి రెండు లేదా మూడు సార్లు కోతకు వచ్చే అవకాశముంది. ఫలితంగా ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దీర్ఘకాలిక ఆదాయ వనరిగా మారుతుంది.

నిమ్మ సాగుతో లాభాలు

నిమ్మ సాగు మొదట్లో చిన్న పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కానీ, ఒక్కసారి మొక్కలు పెరిగి దిగుబడి మొదలైతే, మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఊహించలేని స్థాయిలో లాభాలు పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిగా, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక స్థాయిలోనూ ఈ సాగు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories