Gold Prices: అక్షయ తృతియపై భారీగా పెరిగిన బంగారం ధరల ప్రభావం... వ్యాపారుల ఆశలు గల్లంతు

Gold Prices: అక్షయ తృతియపై భారీగా పెరిగిన బంగారం ధరల ప్రభావం... వ్యాపారుల ఆశలు గల్లంతు
x
Highlights

Gold prices and Akshaya Tritiya: అక్షయ తృతియ అంటేనే బంగారం వ్యాపారులకు ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది.

Impact of Gold prices on Akshaya Tritiya 2025: బంగారం ధరలు భారీగా పెరిగి రూ. లక్షకు చేరువైన సంగతి తెలిసిందే. ఆల్రెడీ లక్ష మార్క్ తాకి మళ్లీ కొద్దిగా తగ్గినప్పటికీ, గత ఏడాది అక్షయ తృతియతో పోల్చుకుంటే ఈసారి బంగారం ధర కొండెక్కి కూర్చుంది. 2024 లో మే 10న అక్షయ తృతియ వచ్చింది. అప్పుడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,090 గా ఉండింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,000 గా ఉండింది. కానీ ఈసారి బంగారం ధర రూ. 95000 దాటింది.

మాములుగా అయితే, అక్షయ తృతియ వచ్చిందంటే చాలా చాలామంది తమకు ఉన్నంతలో బంగారం కొనేందుకు మొగ్గు చూపుతుంటారు. ఆరోజు బంగారం కొంటే కలిసి వస్తుందనే నమ్మకంతో ఆ పని చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్న ధరలకు ఈసారి అక్షయ తృతియకు బంగారం కొనాలంటే జనం జడుసుకుంటున్నారు. బంగారం కొనడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. కొంతమంది కస్టమర్స్ స్పందిస్తూ... ఇంకొన్ని వారాలు వేచిచూద్దామని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఏదేమైనా అక్షయ తృతియ అంటేనే బంగారం వ్యాపారులకు ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది. రకరకాల ఆఫర్స్ ఇస్తూ బంగారం కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. బంగారం అమ్మకాలపై బ్రాంచీల వారీగా టార్గెట్స్ కూడా పెట్టుకుంటుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అక్షయ తృతియ కోసం గోల్డ్ జువెలరీ షాపులు జిగేల్ జిగేల్‌మనేలా డెకరేట్ చేశారు. ఆబిడ్స్, నాంపల్లి, జనరల్ బజార్, చార్మినార్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌షుక్ నగర్, పంజాగుట్ట, సోమాజీగూడ... ఇలా నగరం నలుమూలలా బంగారం దుకాణాలు ఎప్పటికంటే ఎక్కువ హంగులతో డెకరేట్ అయ్యాయి.

జువెలరీ షోరూమ్స్ నిర్వాహకులు తమ వద్ద ఉన్న పాత కాంటాక్ట్స్, షాపింగ్ మాల్స్, బ్యాంకుల ద్వారా సేకరించిన కాంటాక్ట్స్ తీసి కొనుగోలుదారులకు ఫోన్ చేసి మరీ ఆఫర్స్ గురించి వివరిస్తున్నారు. కానీ ఈసారి బంగారం ధరలు ఎక్కువగా ఉండటం వల్ల తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కొనుగోలుదారులు బదులిస్తున్నారు. బంగారం కొనుగోలుపై తాము చెప్పే ఆఫర్స్ వినిపించుకునేందుకు కూడా కస్టమర్స్ ఆసక్తి చూపించడం లేదని బంగారం దాకాణదారులు వాపోతున్నారు. దీంతో ఈ అక్షయ తృతియపై పెరిగిన బంగారం ధరల ప్రభావం (Gold rates impact on Akshaya Tritiya) భారీగానే ఉండే అవకాశం ఉందని పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories