భారత్–అమెరికా వాణిజ్య ముసాయిదా ఒప్పందం: సుంకాల కోతలు, కీలక నిర్ణయాలు

భారత్–అమెరికా వాణిజ్య ముసాయిదా ఒప్పందం: సుంకాల కోతలు, కీలక నిర్ణయాలు
x

భారత్–అమెరికా వాణిజ్య ముసాయిదా ఒప్పందం: సుంకాల కోతలు, కీలక నిర్ణయాలు

Highlights

భారత్–అమెరికా మధ్య వాణిజ్య ముసాయిదా ఒప్పందం ముందుకు. సుంకాల కోతలు, ఇంధన కొనుగోళ్లు, రైతుల రక్షణ, ద్వైపాక్షిక వాణిజ్యానికి కొత్త ఊతం.

భారత్–అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర ముసాయిదాపై ఇరు దేశాలు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల్యం చేయడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, పరస్పర ఆర్థిక సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని రూపుదిద్దుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అదనంగా విధించిన 25 శాతం సుంకాల తొలగింపు, కొన్ని ఉత్పత్తులపై సుంక రాయితీలు, విమానాలు మరియు విమాన విడిభాగాలపై పన్ను సడలింపులు వంటి అంశాలు ముసాయిదాలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంధన ఉత్పత్తులను భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయనున్నట్లు సంకేతాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోళ్ల లక్ష్యం ప్రతిపాదించబడినట్లు పేర్కొంటున్నారు.

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు), ఫార్మాస్యూటికల్స్, పారిశ్రామిక పదార్థాల వాణిజ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకునే అంశం కూడా చర్చలో ఉంది. రైతులు, పాడిపరిశ్రమ, మత్స్యకారులు, స్టార్టప్ రంగ ప్రయోజనాలను కాపాడే విధంగా రక్షణ చర్యలు ఉండనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రూల్స్ ఆఫ్ ఆరిజిన్, సుంకేతర అడ్డంకుల పరిష్కారం, ఆహార–వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం సులభతరం చేసే అంశాలు కూడా ఒప్పందంలో చోటు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, మేకిన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories