Indian Railways: రద్దయిన రైలు టికెట్లపై రీఫండ్ పెంపు పట్ల రైల్వే పరిశీలన

Indian Railways
x

Indian Railways: రద్దయిన రైలు టికెట్లపై రీఫండ్ పెంపు పట్ల రైల్వే పరిశీలన

Highlights

Indian Railways: ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రద్దు చేసిన రైలు టికెట్లపై ఇచ్చే రీఫండ్ మొత్తాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది.

Indian Railways: ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రద్దు చేసిన రైలు టికెట్లపై ఇచ్చే రీఫండ్ మొత్తాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుతం అమలులో ఉన్న 'క్లర్కేజీ ఛార్జీ'లను తగ్గించాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా? అనే అంశాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు.

ప్రస్తుతం వెయిటింగ్ లిస్టు లేదా ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సలేషన్) టికెట్లను ప్రయాణికులు రద్దు చేసుకున్నప్పుడు, క్లర్కేజీ ఛార్జీలను మినహాయించి మాత్రమే డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులకు పూర్తి రీఫండ్ అందకపోవడంతో, అనేక విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో టికెట్ రద్దు ప్రక్రియను ప్రయాణికులకు మరింత అనుకూలంగా మార్చేందుకు రైల్వే శాఖ ఈ చార్జీలను పునఃసమీక్షిస్తోంది. త్వరలో కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా రైల్వే తీసుకోనున్న ఈ నిర్ణయం వల్ల రద్దయిన టికెట్లపై ప్రయాణికులకు మరింత న్యాయం జరగనుంది. ముఖ్యంగా తరచుగా టికెట్లు బుక్ చేసి, ఆ తర్వాత పరిస్థితుల వలన రద్దు చేసుకునే ప్రయాణికులకు ఇది ఉపశమనంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories