India Forex Reserves: రెండేళ్లలో భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు.. ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే ?

India Forex Reserves
x

India Forex Reserves: రెండేళ్లలో భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు.. ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే ?

Highlights

India Forex Reserves: ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. మార్చి 7 తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు ఒకే వారంలో 15 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి.

India Forex Reserves: ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. మార్చి 7 తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు ఒకే వారంలో 15 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. ఇది రెండేళ్లలో అత్యధికం. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలను, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బిఐ డాలర్లను విక్రయించింది. దీని కారణంగా విదేశీ మారక నిల్వలు పెద్ద తగ్గుదల కనిపించాయి.

మార్చి 7తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 15.26 బిలియన్ డాలర్లు పెరిగి 653.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, ఇది రెండేళ్లలో అతిపెద్ద జంప్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత వారం దేశ విదేశీ మారక నిల్వలు 1.78 బిలియన్ డాలర్లు తగ్గి 638.69 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2024 చివరి నాటికి విదేశీ మారక నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.88బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ రూపాయి అస్థిరతను తగ్గించడానికి RBI విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో పాటు రీవాల్యుయేషన్ కారణంగా నిల్వలు ఇటీవల తగ్గుముఖం పడుతున్నాయి.

ఆర్‌బిఐ డేటా ప్రకారం.. రివ్యూలో ఉన్న వారంలో విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరగడానికి ఫిబ్రవరి 28న సెంట్రల్ బ్యాంక్ చేసిన 10 బిలియన్ డాలర్ల విదేశీ మారక మార్పిడి కారణమని, వ్యవస్థలో ద్రవ్యతను పెంచడానికి రూపాయిలకు వ్యతిరేకంగా డాలర్లను కొనుగోలు చేయడం వల్ల ఇది జరిగిందని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, విదేశీ మారక నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు రివ్యూ వీక్ లో 13.99 బిలియన్ డాలర్లు పెరిగి 557.28 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి. డా

ఆర్‌బిఐ డేటా ప్రకారం, సమీక్షా వారంలో బంగారు నిల్వల విలువ 1.05 బిలియన్ డాలర్లు తగ్గి 74.32 బిలియన్ డాలర్లకు చేరుకుంది. SDR 212 మిలియన్ డాలర్లు పెరిగి 18.21 బిలియన్ డాలర్లు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, సమీక్షలో ఉన్న వారంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద భారతదేశం నిల్వ స్థానం 69 మిలియన్ డాలర్లు పెరిగి 4.14 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories