Investment Tips: 10 వేలు కడితే..10 లక్షలు వచ్చే అద్భుతమైన స్కీమ్ గురించి మీకు తెలుసా..?

Investment Tips
x

Investment Tips: 10 వేలు కడితే..10 లక్షలు వచ్చే అద్భుతమైన స్కీమ్ గురించి మీకు తెలుసా..?

Highlights

Investment Tips: సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు పొదుపు అంటే గుర్తొచ్చేది పోస్టాఫీసు లేదా బ్యాంకు ఎఫ్‌డీలు. కానీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మనల్ని నిజమైన ధనవంతులుగా మార్చే శక్తి వీటికి తక్కువే.

Investment Tips: సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు పొదుపు అంటే గుర్తొచ్చేది పోస్టాఫీసు లేదా బ్యాంకు ఎఫ్‌డీలు. కానీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మనల్ని నిజమైన ధనవంతులుగా మార్చే శక్తి వీటికి తక్కువే. మరి స్టాక్ మార్కెటా? అంటే ఆ రిస్క్ చూసి గుండె జారిపోతుంది. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఒక అద్భుతమైన మార్గంగా నిలిచింది.

నెలకు రూ. 10 వేలు.. చేతికి రూ. 34 లక్షలు

మీరు విన్నది నిజమే. గత పదేళ్ల క్రితం ఎవరైనా ఈ ఫండ్‌లో నెలకు రూ. 10,000 చొప్పున ఎస్‌ఐపీ (SIP) ప్రారంభించి ఉంటే, నేడు వారి ఖాతాలో రూ. 34 లక్షలకు పైగా నిధులు ఉండేవి. ఏడాదికి సగటున 19.86 శాతం వార్షిక రాబడిని అందిస్తూ, ఈ ఫండ్ ఇన్వెస్టర్ల కలను సాకారం చేసింది. కేవలం నెలవారీ పొదుపు మాత్రమే కాదు, లంప్సమ్ పెట్టుబడిదారులకు కూడా ఇది కాసుల వర్షం కురిపించింది:

3 ఏళ్ల క్రితం పెట్టిన రూ. 1 లక్ష ఇప్పుడు రూ. 2.10 లక్షలు.5 ఏళ్ల క్రితం పెట్టిన లక్ష రూపాయలు రూ. 3.31 లక్షలు.10 ఏళ్ల క్రితం పెట్టిన లక్ష ఇప్పుడు ఏకంగా రూ. 5.17 లక్షలు.తక్కువ ఖర్చు! 2013లో ప్రారంభమైన ఈ స్కీమ్, కేవలం 0.83% ఎక్స్‌పెన్స్ రేషియోతో ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలను అందిస్తోంది. దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తున్నందున, భవిష్యత్తులో కూడా ఈ ఫండ్ దూసుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మార్కెట్‌లో రిస్క్ లేని పెట్టుబడి ఉండదు, కానీ ఎల్ఐసీ వంటి నమ్మకమైన సంస్థలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే 'చక్రవడ్డీ' మ్యాజిక్ ఎలా ఉంటుందో ఈ ఫండ్ నిరూపించింది. మీ ఆర్థిక భవిష్యత్తుకు పునాది వేయడానికి ఇదే సరైన సమయం.

Show Full Article
Print Article
Next Story
More Stories