Indian Railway: డ‌బ్బులు లేక‌పోయినా రైళ్లో ప్ర‌యాణం చేయొచ్చు.. ఎలాగో తెలుసా ?

Indian Railway
x

Indian Railway: డ‌బ్బులు లేక‌పోయినా రైళ్లో ప్ర‌యాణం చేయొచ్చు.. ఎలాగో తెలుసా ?

Highlights

Indian Railway: రైళ్లో ప్ర‌యాణించాలంటే క‌చ్చితంగా టికెట్ తీసుకోవాల‌నే విష‌యం తెలిసిందే. ఇందుకు డ‌బ్బులు కావాలి. అయితే ఇక‌పై డ‌బ్బులు లేకుండానే రైళ్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.? డ‌బ్బులు లేకున్నా రైలు టికెట్‌ బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Indian Railway: రైళ్లో ప్ర‌యాణించాలంటే క‌చ్చితంగా టికెట్ తీసుకోవాల‌నే విష‌యం తెలిసిందే. ఇందుకు డ‌బ్బులు కావాలి. అయితే ఇక‌పై డ‌బ్బులు లేకుండానే రైళ్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.? డ‌బ్బులు లేకున్నా రైలు టికెట్‌ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వేస్ సామాన్య ప్రయాణికుల కోసం కొత్తగా 'ePayLater' అనే ఫీచ‌ర్‌ను తీసుకొస్తోంది.

మీ వ‌ద్ద డ‌బ్బులు లేక‌పోయినా.. IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ (Android/iOS) ద్వారా టికెట్ బుక్ చేసుకుని, 14 రోజుల్లోపు చెల్లించవచ్చు. ఇది సాధ్యమయ్యేలా IRCTC–ePayLater అనే ఫిన్‌టెక్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది.

ఈ ఫీచ‌ర్ ఎలా ఉప‌యోగించుకోవాలి.?

* ముందుగా IRCTC ఖాతాలో లాగిన్ అవ్వండి.

* మీరు ప్రయాణించాల్సిన రైలు, విమానం లేదా టూర్ ప్యాకేజీ ఎంపిక చేయండి.

* బుకింగ్ సమయంలో చెల్లింపు పేజీకి వెళ్లండి.

* అక్కడ 'ePayLater' అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.

* టికెట్‌ బుకింగ్ పూర్త‌వుతుంది. టికెట్‌కి అయ్యే ఖ‌ర్చును 14 రోజుల్లోపు చెల్లించ‌వ‌చ్చు.

* డెబిట్/క్రెడిట్ కార్డులు లేకున్నా చెల్లింపులు చేసుకోవ‌చ్చు.

* ఫ్లైట్ టిక్కెట్లకు కూడా ఈ ఫీచర్ వర్తిస్తుంది

ఈ పథకం ద్వారా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తూ, డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. IRCTC క్యాటరింగ్, టూరిజం విభాగం ఈ వ్యవస్థను అమలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories