JioFinance: రూ.24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ సెన్సేషన్ ఆఫర్

JioFinance: రూ.24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ సెన్సేషన్ ఆఫర్
x

JioFinance: రూ.24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ సెన్సేషన్ ఆఫర్

Highlights

2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15 దగ్గరపడుతున్న తరుణంలో, జియోఫైనాన్స్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.24తోనే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసుకునే వీలు కల్పించింది.

ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి జియో ఫైనాన్స్ యాప్‌లో కొత్తగా జోడించిన ట్యాక్స్ ప్లానింగ్ & ఫైలింగ్ ఫీచర్ ద్వారా స్వయంగా రిటర్న్ దాఖలు చేయాలి.

అయితే ఈ రూ.24 ప్లాన్ ఒకే ఫారం-16 కలిగిన జీతభత్యదారులకు మాత్రమే వర్తిస్తుంది.

బిజినెస్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ వంటి క్లిష్టమైన ట్యాక్స్ కేసుల కోసం ఈ ప్లాన్ పనిచేయదు. అలాంటివారికి కంపెనీ ప్రత్యేకంగా రూ.999 ప్లాన్ అందిస్తోంది.

ఇతర ప్లాట్‌ఫాంల ధరలతో పోల్చితే:

టాక్స్2విన్: బేసిక్ రూ.49, సీఏ సహాయం రూ.1,274 – రూ.7,968

మైట్రీటర్న్: సెల్ఫ్ ఫైలింగ్ రూ.199, సీఏ సహాయం రూ.1,000 – రూ.6,000

టాక్స్ మేనేజర్: రూ.500 నుంచి ప్రారంభం, సీఏతో రూ.5,000 వరకు

క్లియర్ టాక్స్: బేసిక్ రూ.2,540, లక్స్ ప్లాన్ రూ.25,000

టాక్స్‌బడ్డీ: సెల్ఫ్ ఫైలింగ్ రూ.699, కాంప్లెక్స్ కేసులు రూ.2,999

ఈ లిస్టుతో పోలిస్తే జియోఫైనాన్స్ అందిస్తున్న రూ.24 ప్లాన్ అత్యంత తక్కువ ఖర్చు. అయితే నిపుణులు మాత్రం “ధర చూసి నిర్ణయం తీసుకోవద్దు. చౌకైన ప్లాన్‌లలో ప్రొఫెషనల్ మార్గదర్శకత్వం ఉండకపోవచ్చు” అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తమ అవసరాలను బట్టి ప్లాన్ ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories