Lalith Kesre: రైతు బిడ్డ నుంచి బిలియనీర్ వరకు… గ్రో షేర్ల ర్యాలీ సంచలనం!

Lalith Kesre: రైతు బిడ్డ నుంచి బిలియనీర్ వరకు… గ్రో షేర్ల ర్యాలీ సంచలనం!
x
Highlights

Groww MD లలిత్ కేశ్రే బిలియనీర్‌గా అవతరం. గ్రో షేర్లు 20% అప్పర్ సర్క్యూట్, 4 రోజుల్లో 78% రిటర్న్స్, మార్కెట్ వాల్యూ ₹1.10 లక్ష కోట్ల దాటింది. లలిత్ కేశ్రే జీవితం, Groww IPO లాభాలు — పూర్తి వివరాలు.

ఆన్‌లైన్ స్టాక్‌బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ గ్రో (Groww) మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో విజృంభిస్తున్నాయి. లిస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే భారీ ర్యాలీ ఇవ్వడంతో, ఐపీఓలో షేర్లు పొందిన మదుపర్ల ముఖాల్లో చిరునవ్వులు మెరవడం మాత్రమే కాదు… మరో భారతీయ బిలియనీర్ జన్మించడానికీ ఇది కారణమైంది.

గ్రో మార్కెట్ విలువ లక్ష కోట్లు దాటింది!

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో Groww షేరు 20% అప్పర్ సర్క్యూట్‌తో ₹178.23 వద్ద ముగిసింది.

దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ₹1.10 లక్షల కోట్లకు చేరింది.

లలిత్ కేశ్రే – రైతు బిడ్డ నుంచి ₹10,000 కోట్ల సంపదదాకా

గ్రో మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కేశ్రే వద్ద కంపెనీకి చెందిన 55.91 కోట్ల షేర్లు ఉన్నాయి.

ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆయన నికర సంపద:

  1. ₹9,960 కోట్లు
  2. $1.12 బిలియన్

దీంతో లలిత్ కేశ్రే అధికారికంగా భారతదేశపు తాజా బిలియనీర్ అయ్యారు.

Groww IPO: నాలుగు రోజుల్లోనే 78% లాభం

నవంబర్ 4–7 మధ్య జరిగిన గ్రో ఐపీఓలో షేర్లు ₹100 ధరకు మదుపర్లకు కేటాయించారు.

12న మార్కెట్లో లిస్ట్ కాగా — 17వ తేదీకి షేర్ ధర ₹178.23 చేరింది.

అంటే,

కేవలం 4 ట్రేడింగ్ రోజుల్లోనే = 78% రిటర్న్స్!

స్టాక్‌మార్కెట్లో ఉన్న 5,000 కంపెనీల్లో — మార్కెట్ క్యాప్ ₹1 లక్ష కోట్లు దాటిన కంపెనీలు 100 మాత్రమే.

గ్రో ఈ లిస్టులోకి చేరడం విశేషం.

అదే సమయంలో ఏంజెల్ వన్, 5పైసా, ఆనంద్ రాఠీ వంటి బ్రోకింగ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ కలిపినా ₹70,000 కోట్ల దాటడం లేదు.

లలిత్ కేశ్రే – స్ఫూర్తిదాయక ప్రయాణం

మధ్యప్రదేశ్‌లోని లెపా అనే మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన లలిత్, చిన్నప్పటి నుంచే కష్టపడి చదివాడు. ఇంగ్లిష్ మీడియం స్కూల్ కూడా లేకపోయినా —

  1. JEEలో మంచి ర్యాంక్
  2. IIT Bombayలో అడ్మిషన్
  3. B.Tech & M.Tech పూర్తి

2016లో Flipkart మాజీ ఉద్యోగులైన హర్ష్ జైన్, ఇషాన్ బన్సల్, నీరజ్ సింగ్‌లతో కలిసి Growwను ప్రారంభించారు.

Peak XV, Y Combinator, Ribbit Capital, Tiger Global వంటి ఇన్వెస్టర్ల మద్దతుతో Groww వేగంగా ఎదిగింది.

2025 మార్చి 31 ఫైనాన్షియల్స్:

  1. రెవెన్యూ: ₹4,056 కోట్లు
  2. నికర లాభం: ₹1,824 కోట్లు

అటువంటి స్టార్ట్‌అప్ నేడు ఒక్క రోజులోనే బిలియనీర్‌ను తయారు చేసింది!

Show Full Article
Print Article
Next Story
More Stories