LIC కొత్త స్కీమ్స్: మహిళలకు ప్రత్యేకంగా ‘బీమా లక్ష్మి’ & తక్కువ ఆదాయాల కోసం ‘జన సురక్ష’

LIC కొత్త స్కీమ్స్: మహిళలకు ప్రత్యేకంగా ‘బీమా లక్ష్మి’ & తక్కువ ఆదాయాల కోసం ‘జన సురక్ష’
x

LIC కొత్త స్కీమ్స్: మహిళలకు ప్రత్యేకంగా ‘బీమా లక్ష్మి’ & తక్కువ ఆదాయాల కోసం ‘జన సురక్ష’

Highlights

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (LIC) రెండు కొత్త పాలసీలను లాంచ్ చేసింది.

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (LIC) రెండు కొత్త పాలసీలను లాంచ్ చేసింది. ఇవి జన సురక్ష (ప్లాన్ 880) మరియు బీమా లక్ష్మి (ప్లాన్ 881). ఈ పాలసీలు అక్టోబర్ 15, 2025 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఆదాయం ఉన్నవారికి జన సురక్ష, మహిళలకు మాత్రమే బీమా లక్ష్మి అందుబాటులో ఉంది.

జన సురక్ష (Plan 880)

ఈ ప్లాన్ అందరికీ తక్కువ ఖర్చులో బీమా సదుపాయం అందించేందుకు రూపొందించబడింది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ప్లాన్, అంటే మార్కెట్ సంబంధం లేకుండా పనిచేస్తుంది, బోనస్ చెల్లింపులు ఉండవు.

వయసు: 18-55 సంవత్సరాలు

పాలసీ కాలం: 12-20 సంవత్సరాలు

బీమా హామీ మొత్తం: కనీస ₹1 లక్ష, గరిష్టం ₹2 లక్ష

ప్రీమియం చెల్లింపు: పాలసీ కాలం కంటే 5 సంవత్సరాలు తక్కువ (ఉదా: 12 సంవత్సరాల పాలసీకి 7 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి)

గ్యారెంటీడ్ అడిషన్స్: వార్షిక ప్రీమియంపై 4%

మెచ్యూరిటీ బెనిఫిట్: హామీ మొత్తం + గ్యారెంటీడ్ అడిషన్స్

ప్రేమియం ఫ్రీక్వెన్సీ: నెలకోసారి, త్రైమాసికం, ఆరు నెలలకు, లేదా ఏడాదికి

అదనపు సదుపాయాలు: రుణం, రైడర్లు

బీమా లక్ష్మి (Plan 881)

మహిళలకు బీమా + పొదుపు కలిగిన ప్రత్యేక పాలసీ. ఇది కూడా నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, బోనస్ చెల్లింపులు లేవు. మూడు పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి:

పాలసీ కాలం: 25 సంవత్సరాలు

ప్రీమియం కాలం: 7-15 సంవత్సరాలు

వయసు: 18-50 సంవత్సరాలు

కనీస బీమా హామీ: ₹2 లక్ష, గరిష్ట పరిమితి లేదు

ఆప్షన్లు:

A: పాలసీ కాలం పూర్తయ్యాక 50% మొత్తాన్ని చెల్లించబడుతుంది

B: ప్రతి 2 సంవత్సరాలకోసారి 7.5% చెల్లింపు, మొత్తం 12 సార్లు

C: ప్రతి 4 సంవత్సరాలకోసం 15% చెల్లింపు, మొత్తం 6 సార్లు

గ్యారెంటీడ్ అడిషన్స్: వార్షిక ప్రీమియం 7%

మెచ్యూరిటీ బెనిఫిట్: బీమా హామీ మొత్తం + గ్యారెంటీడ్ అడిషన్స్

డెత్ బెనిఫిట్: పాలసీ కాలంలో ఆ వ్యక్తికి ఏదైనా జరిగినట్లయితే, వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా బీమా హామీ మొత్తం ఎక్కువైతే అది చెల్లించబడుతుంది

ప్రేమియం ఫ్రీక్వెన్సీ: నెలకోసం, త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాది

ఐచ్ఛిక రైడర్లు: Accidental Death & Disability, New Term Assurance Rider, Female Critical Illness Rider

ఈ పాలసీలు వివిధ అవసరాలను పూర్తి చేయడానికి, మహిళల భద్రత, తక్కువ ఆదాయ గల వారికి ఆర్ధిక భద్రత అందించడానికి రూపొందించబడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories