Trump : నాసాలో కలకలం..ట్రంప్ నిర్ణయంతో వేల ఉద్యోగాలు గల్లంతు

Trump
x

Trump : నాసాలో కలకలం..ట్రంప్ నిర్ణయంతో వేల ఉద్యోగాలు గల్లంతు

Highlights

Trump : అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ నాసాకు కష్టాలు మొదలయ్యాయి. నాసాలో 2 వేల మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Trump : అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ నాసాకు కష్టాలు మొదలయ్యాయి. నాసాలో 2 వేల మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది చంద్రుడు, అంగారకుడు వంటి కీలక మిషన్లపై పనిచేస్తున్నవారే. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నాసా బడ్జెట్‌లో భారీ కోత విధించాలని తీసుకున్న నిర్ణయమే. ఈ వార్త నాసా ఉద్యోగులతో పాటు అంతరిక్ష ప్రియులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

అమెరికా మీడియా సంస్థ పాలిటికో తాజా నివేదిక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నాసా అంతర్గత డాక్యుమెంట్‌ల ఆధారంగా, మొత్తం 2,145 మంది సీనియర్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోబోతున్నారని నివేదిక పేర్కొంది. వీరంతా GS-13 నుండి GS-15 ర్యాంక్‌లలో ఉన్నవారు. అంటే, వీరికి ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు ఉన్నాయి. వీరిలో దాదాపు 1,818 మంది సైన్స్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ వంటి మిషన్లపై పనిచేస్తున్నారు. మిగిలిన వారు అడ్మిన్, ఐటీ, ఫైనాన్స్ లేదా మేనేజ్‌మెంట్ వంటి సహాయక పాత్రలలో ఉన్నారు.

నాసా ఈ ఉద్యోగులకు కొన్ని ఆప్షన్లు ఇచ్చింది, అవి: త్వరగా పదవీ విరమణ చేయడం, స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలేయడం లేదా కొన్ని నెలల తర్వాత బాధ్యతలు వదులుకోవడం. నాసా ప్రతినిధి బెథానీ స్టీవెన్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. తక్కువ బడ్జెట్‌లో కూడా తమ బాధ్యతలను పూర్తి చేయడానికి ఏజెన్సీ ప్రయత్నిస్తోందని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలో అమెరికా ముందు వరుసలో ఉండేలా, చంద్రుడు-అంగారక మిషన్లు సక్సెస్ అయ్యేలా ప్రభుత్వం సహకారంతో పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ఏ సెంటర్లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి?

పాలిటికో నివేదిక ప్రకారం నాసాలోని అనేక పెద్ద సెంటర్లు ఈ కోత ప్రభావానికి గురవుతున్నాయి. ఎక్కువగా ప్రభావితం అవుతున్న సెంటర్లు ఇవే:

గోడార్డ్ (మేరీల్యాండ్): 607 ఉద్యోగులు

జాన్సన్ (టెక్సాస్): 366 ఉద్యోగులు

కెనడీ (ఫ్లోరిడా): 311 ఉద్యోగులు

నాసా హెడ్క్వార్టర్ (వాషింగ్టన్): 283 ఉద్యోగులు

లాంగ్లీ (వర్జీనియా): 281 ఉద్యోగులు

మార్షల్ (అలబామా): 279 ఉద్యోగులు

గ్లెన్ (ఒహాయో): 191 ఉద్యోగులు

ఈ సెంటర్లలో చంద్రుడు, అంగారక మిషన్ల సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంత మంది అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఒకేసారి వెళ్లిపోవడం నాసాకు పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. ముఖ్యంగా చంద్రుడికి 2027, అంగారకుడికి రాబోయే సంవత్సరాల్లో మిషన్ల గడువు నిర్ణయించబడిన నేపథ్యంలో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. వైట్ హౌస్ నాసా 2026 బడ్జెట్‌లో 25శాతం భారీ కోతకు ప్రతిపాదన చేసింది. ఇది ఆమోదం పొందితే, పరిస్థితి మరింత దిగజారవచ్చు. దీనివల్ల 5,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని అంచనా. అంటే, 1960ల తర్వాత నాసాకు ఇంత తక్కువ బడ్జెట్, తక్కువ ఉద్యోగులతో పనిచేయాల్సి రావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories