Public Sector Banks : గుడ్ న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన రద్దు ?

Public Sector Banks
x

Public Sector Banks : గుడ్ న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన రద్దు ?

Highlights

Public Sector Banks : చాలా బ్యాంకులు తమ ఖాతాల్లో మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ నిబంధనలను పాటిస్తాయి. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లలో కనీసం రూ.500 నుంచి రూ.10,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని నిబంధన ఉంటుంది.

Public Sector Banks : చాలా బ్యాంకులు తమ ఖాతాల్లో మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ నిబంధనలను పాటిస్తాయి. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లలో కనీసం రూ.500 నుంచి రూ.10,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని నిబంధన ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ నిబంధనకు మినహాయింపు కాదు. అయితే, ఇప్పుడు ఈ ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనను తొలగించే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు

ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లలో మొత్తం డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులు ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపాయి. ఈ చర్చల సమయంలో బ్యాంక్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలగించే విషయంపై మళ్ళీ ఆలోచించాలని ఒక సలహా ఇచ్చినట్లు ప్రముఖ మీడియా పత్రిక నివేదించింది. ఈ నిబంధన రద్దయితే కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఇప్పటికే కొన్ని బ్యాంకులు రద్దు

ఇప్పటికే కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఉపసంహరించుకున్నాయి. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన అంటే ఏమిటి?

ఒక బ్యాంక్ ఖాతాలో కనీస మొత్తంలో డబ్బు ఉండాలి అని చెప్పే నిబంధనే మినిమమ్ బ్యాలెన్స్ రూల్. ఉదాహరణకు, రూ.1,000 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని నిబంధన ఉంటే, ఆ ఖాతాలో ఎప్పుడూ కనీసం సగటున రూ.1,000 కంటే ఎక్కువ డబ్బు ఉండాలి. ఒకవేళ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. ఒక నెలలో మీరు వివిధ రోజుల్లో కలిగి ఉన్న కనీస బ్యాలెన్స్ ఆధారంగా సగటును లెక్కిస్తారు. మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలకు నెలకు రూ.25 నుండి రూ.650 వరకు ఫైన్ వసూలు చేస్తారు.

కొన్ని సంవత్సరాల క్రితం RTI ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం, SBI లో మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలకు విధించే ఛార్జీల మొత్తం, ఆ బ్యాంక్ మొత్తం నికర లాభం కంటే ఎక్కువగా ఉంది. ఇది ఒక పెద్ద వివాదానికి దారితీసింది. దీని తర్వాత, 2020లో SBI మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలగించింది. అలా చేసిన మొదటి ప్రభుత్వ బ్యాంక్‌గా SBI నిలిచింది. ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories