Rs.20 New Note: నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు RBI చర్యలు.. త్వరలో కొత్త రూ.20 నోట్లు!

Rs.20 New Note
x

Rs.20 New Note: నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు RBI చర్యలు.. త్వరలో కొత్త రూ.20 నోట్లు!

Highlights

Rs.20 New Note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో రూ.20 కొత్త నోట్లను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకు శనివారం తెలిపింది.

Rs.20 New Note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో రూ.20 కొత్త నోట్లను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకు శనివారం తెలిపింది. కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ న్యూ సిరీస్‌లోని రూ.20 నోట్ల మాదిరిగానే ఉంటుంది.

దీంతో పాటు రూ.20 కొత్త నోట్లు విడుదలైన తర్వాత కూడా పాత నోట్లు చెలామణిలో ఉంటాయని RBI తెలిపింది. అంటే, ఇప్పటికే చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేయరు. బదులుగా కొత్త నోట్లను వాటిలో కలుపుతారు. పాత నోట్ల చెలామణిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.

కొత్త నోటు డిజైన్ ఎలా ఉంటుంది?

కొత్త నోటు డిజైన్ ప్రస్తుత నోటు కంటే కొంచెం భిన్నంగా ఉండవచ్చు. ఇందులో మీకు కొన్ని కొత్త ఫీచర్‌లు, రంగులు కనిపించవచ్చు. నోటుపై మహాత్మా గాంధీ చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, నంబర్ ప్యాటర్న్‌ను మరింత బలపరుస్తారు.

కొత్త నోట్లు ఎందుకు వస్తున్నాయి?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశ్యం కరెన్సీ సురక్షితంగా ఉండాలి. నకిలీ నోట్ల మోసం వంటి సంఘటనలు జరగకూడదు.అందుకే RBI ఎప్పటికప్పుడు కొత్త నోట్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతని సంతకంతో కూడా నోట్లు విడుదల చేస్తారు.

పాత నోట్లను మార్చుకోవాలా?

పాత నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటిని బ్యాంకుల్లో జమ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొత్త నోట్లు విడుదలైనప్పుడు మీరు కొత్త, పాత నోట్లను రెండింటినీ ఉపయోగించవచ్చు. కొత్త నోట్లు బ్యాంకులు, ATMల ద్వారా మీకు అందుబాటులోకి వస్తాయి. మొత్తంమీద, RBI రూ.20 కొత్త నోట్లు విడుదల చేసిన తర్వాత పాత రూ.20 నోట్లు రద్దు కావు. వాటిని ఎక్కడా జమ చేయాల్సిన అవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories