New UPI Rules: యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు.. ఒకే ట్రాన్సాక్షన్‌లో రూ. 5 లక్షల వరకు పేమెంట్స్!

New UPI Rules: యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు.. ఒకే ట్రాన్సాక్షన్‌లో రూ. 5 లక్షల వరకు పేమెంట్స్!
x
Highlights

New UPI Rules: యూపీఐ చెల్లింపులు చేసే వారికి ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చాయి.

New UPI Rules: యూపీఐ చెల్లింపులు చేసే వారికి ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చాయి. దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనున్నాయి. చిరు వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు ఉపయోగపడేలా ఈ మార్గదర్శకాలను రూపొందించారు ఎన్పీసీఐ. దీంతో భారీ లావాదేవీలు సులభతరం కానుంది. డిజిటల్ చెల్లింపుల వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త రూల్స్‌ను అమలు చేస్తున్నట్టు ఎన్పీసీఐ వెల్లడించింది.

సెప్టెంబర్ 15 ముందు ఇన్సూరెన్స్ ప్రీమియమ్ లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే, లిమిట్ తక్కువ ఉండటం వల్ల రెండు, మూడు సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. కొత్త రూల్స్ ప్రకారం, ఒక్కో ట్రాన్సాక్షన్‌లో 5 లక్షలు, ఒక రోజులో గరిష్టంగా 10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే, మీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్ లేదా హోమ్ లోన్ ఈఎంఐ ఒకే సారి క్లియర్ చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ బిల్స్, ట్రావెల్ బుకింగ్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం కోసం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త రూల్స్ ప్రకారం, ఒక ట్రాన్సాక్షన్‌లో 5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా 6 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయొచ్చు. అలాగే, ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్‌లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. విదేశాలకు ట్రావెల్ ప్లాన్ చేసినప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఖరీదైనా వస్తువులు కొనాలనుకుంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్‌లో 6 లక్షల బిల్లు కట్టొచ్చు. బిజినెస్ లేదా మర్చంట్ పేమెంట్స్‌కి కూడా రూ.5 లక్షల వరకు ఒకే ట్రాన్సాక్షన్‌లో చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. అంటే, షాప్‌కీపర్స్, బిజినెస్ ఓనర్స్‌కి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. పెద్ద లావాదేవీలు సులభంగా, ఫాస్ట్‌గా పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. అయితే వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే యూపీఐ ట్రాన్స్ఫర్‌లపై రోజువారీ పరిమితి మాత్రం యథాతథంగా లక్ష రూపాయలు గానే కొనసాగనుంది. ఈ మార్పులు డిజిటల్ ఇండియాకు మరింత బలం చేకూరుస్తాయని, వినియోగదారులకు పెద్ద సౌలభ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories