Oracle Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకమా?.. భారతీయ ఐటీ సిబ్బందిపై ఒరాకిల్ షాక్

Oracle Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకమా?.. భారతీయ ఐటీ సిబ్బందిపై ఒరాకిల్ షాక్
x

Oracle Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకమా?.. భారతీయ ఐటీ సిబ్బందిపై ఒరాకిల్ షాక్

Highlights

ఐటీ రంగంలో ఉన్నవారికే కాదు, ఇందులో కెరీర్ మొదలు పెట్టాలనుకునే వారికి కూడా రోజురోజుకీ షాక్‌లు తగులుతున్నాయి. ఒకప్పుడు లక్షల్లో ప్యాకేజీలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్స్ అన్నీ సాధారణమైపోయినా, ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఉద్యోగం పోతుందోనని ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు.

ఐటీ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఒకప్పుడు లక్షల జీతాలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్పులు కలిగిన కలల కెరీర్‌గా భావించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక వణికిపోతున్నాయి. తాజాగా దిగ్గజ ఐటీ సంస్థ ఒరాకిల్, భారతీయ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది.

సమాచారం ప్రకారం, దేశంలో పనిచేస్తున్న దాదాపు 28,000 మందిలో 10 శాతం మందిని కంపెనీ తొలగించింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, నోయిడా, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు.

ఈ తొలగింపులు ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ సపోర్ట్ టీమ్‌లలో చోటు చేసుకున్నాయి. అయితే, ఇవి సాధారణ చర్యలు కాదని, కక్షపూరిత నిర్ణయం అని కొంతమంది భావిస్తున్నారు.

తొలగింపులకు కొన్ని రోజుల ముందు, ఒరాకిల్ సీఈఓ లారీ విల్సన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఆ వెంటనే ఒరాకిల్, OpenAI తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా AI డేటా ప్రాసెసింగ్ కోసం ఒరాకిల్ మౌలిక వసతులను వినియోగించనుంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ పెట్టుబడుల ఖర్చు భర్తీ కోసం ఇతర విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించినట్లు తెలుస్తోంది.

ఈ తొలగింపులు కేవలం భారతదేశానికే పరిమితం కావు. అమెరికా, కెనడా, మెక్సికోలోని ఒరాకిల్ సిబ్బందికీ ఈ దెబ్బ తగిలింది. ఉదాహరణకు సియాటిల్‌లోనే 150 మందికి పైగా ఉద్యోగులు తొలగించబడ్డారు.

భారతదేశంలో ఒరాకిల్ ప్రయాణం

ఒరాకిల్ భారతదేశంలో అడుగుపెట్టింది దాదాపు 20 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, నోయిడా, కోల్‌కతాలోని కార్యాలయాలతో దేశంలోని ప్రముఖ ఐటీ యజమానులలో ఒకటిగా నిలిచింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉంది.

కానీ, తాజా తొలగింపులు భారతీయ ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై మరింత అనిశ్చితిని సృష్టించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories