PAN Card: పాన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా

PAN Card: పాన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా
x

PAN Card: పాన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా

Highlights

మన దైనందిన జీవితంలో పాన్ కార్డు ప్రాధాన్యం ఎంతో ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం, ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి. ప్రభుత్వం ఇప్పటికే పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది.

మన దైనందిన జీవితంలో పాన్ కార్డు ప్రాధాన్యం ఎంతో ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం, ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి. ప్రభుత్వం ఇప్పటికే పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. అయినా ఇప్పటికీ చాలామంది ఈ నియమాన్ని పట్టించుకోరు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో పాటు చట్టపరమైన ఇబ్బందులు కూడా తప్పవు.

ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డుల ద్వారా జరిగే ప్రతి లావాదేవీని పర్యవేక్షిస్తుంది. ఒకే వ్యక్తి దగ్గర రెండు పాన్ కార్డులు ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇన్కమ్ టాక్స్ యాక్ట్‌ సెక్షన్ 272B ప్రకారం రూ.10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అందుకే ఒకరికొకటి మించి పాన్ కార్డులు ఉంటే వెంటనే వాటిని సమర్పించాలి.

పాన్ కార్డు పోయినా లేదా దొంగిలించబడినా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ దానికి ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. లేకపోతే, ఆ కార్డు దుర్వినియోగం జరిగితే మీరు మోసపూరిత లావాదేవీలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన తర్వాత, బ్యాంకు మరియు ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా సమీపంలోని పాన్ సేవా కేంద్రం ద్వారా కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేయవచ్చు.

తప్పు పాన్ నంబర్‌ను లావాదేవీల్లో ఉపయోగించినా లేదా పన్ను రిటర్నులు ఫైల్ చేసే సమయంలో ఎంటర్ చేసినా, మీపై రూ.10,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. అలాగే పాన్ కార్డులో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా ఉంటే వాటిని వెంటనే సరిచేయాలి. లేకపోతే బ్యాంకులు మీ ఖాతాలను ఫ్రీజ్ చేయడం లేదా మూసివేయడం కూడా జరుగుతుంది.

అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డులపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే చిన్న తప్పిదమే పెద్ద ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యలకు కారణమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories