
రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత నగదు విడుదల తేదీ ఖరారు
PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. అన్నదాతల ఆర్థిక అవసరాల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే 21 విడతల సొమ్మును విజయవంతంగా అందుకున్న రైతులు, ఇప్పుడు రాబోయే రూ.2000 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మార్చి 2026లో ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది.
పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం.. కేంద్రం ప్రతి ఏటా రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.6000 అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తుంది. గతేడాది నవంబర్ 19న ప్రధాని మోదీ 21వ విడతను విడుదల చేశారు. ఆ గడువు ముగియడంతో, ఇప్పుడు తదుపరి విడత మార్చిలో వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో కూడా సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇప్పటివరకు ఈ పథకం కోసం దాదాపు రూ.4 లక్షల కోట్లను వెచ్చించి అన్నదాతలకు కొండంత అండగా నిలిచింది.
అయితే, ఈ 22వ విడత డబ్బులు మీ ఖాతాలోకి రావాలంటే ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. అదే e-KYC. ప్రభుత్వం ఈ ప్రక్రియను ఇప్పుడు మరింత కఠినతరం చేసింది. ఎవరైతే తమ ఆధార్ కార్డును పీఎం కిసాన్ పోర్టల్‌తో లింక్ చేయరో, వారికి లబ్ధిదారుల జాబితాలో పేరున్నా డబ్బులు రావు. కేవలం కేవైసీ మాత్రమే కాకుండా, భూమి రికార్డుల వెరిఫికేషన్ కూడా పూర్తి అయి ఉండాలి. ఈ రెండు పనులు సక్రమంగా ఉంటేనే మీ అకౌంట్‌లో నగదు జమ అవుతుంది.
మీ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే మీ మొబైల్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) లోకి వెళ్లి, Know Your Status ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఇచ్చి, ఓటీపీ ద్వారా లాగిన్ అయితే మీ వివరాలన్నీ కనిపిస్తాయి. అందులో e-KYC, ల్యాండ్ సీడింగ్ పక్కన Yes అని ఉందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ No అని ఉంటే వెంటనే మీ దగ్గరలోని మీ-సేవ కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేయించుకోండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




