PM Kisan Update: రైతులకి అలర్ట్‌.. నేడే లాస్ట్‌ డేట్‌..!

PM Kisan Update Farmers Need to do eKYC Before February 10
x

PM Kisan Update: రైతులకి అలర్ట్‌.. నేడే లాస్ట్‌ డేట్‌..!

Highlights

PM Kisan: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

PM Kisan: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది పీఎం కిసాన్‌ యోజన. ఈ పథకం కింద రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఏటా రూ.6,000 నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తుంది. 2 వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒక వాయిదా చెల్లిస్తోంది. 13వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఫిబ్రవరి 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికే నిధులు జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఆన్‌లైన్ eKYC ఈ విధంగా చేయండి..

1.e-KYC కోసం అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి. అక్కడ e-kyc ఎంపికపై క్లిక్ చేయండి.

2. ఆధార్ నంబర్‌ని నమోదు చేయండి.

3. ఇప్పుడు మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి OTP అభ్యర్థించండి.

4. తర్వాత వివరాలు పూర్తిగా చెల్లుబాటు అయితే eKYC ప్రక్రియ పూర్తవుతుంది.

5. మరోవైపు ప్రక్రియ సరిగ్గా లేకుంటే కేవైసీ పూర్తికాదు. అప్పుడు మీరు ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories