Q Commerce: మెట్రో ఏరియాల్లోనే పెరుగుతోన్న క్విక్ కామర్స్

Q Commerce: మెట్రో ఏరియాల్లోనే పెరుగుతోన్న క్విక్ కామర్స్
x
Highlights

Q Commerce: వస్తువు ఏదైనా సరే...ఇలా ఆర్డర్ పెడితే అలా నిమిషాల్లో ఆర్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే.

Q Commerce: వస్తువు ఏదైనా సరే...ఇలా ఆర్డర్ పెడితే అలా నిమిషాల్లో ఆర్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే. షాపులకు వెళ్లి కొనే రోజులు పోయాయి. ఏది కావాలంటే అది ఆన్ లైన్‌లో దొరుకుతుంది. అయితే ఆర్డర్ పెట్టిన కొన్ని గంటల్లో తెచ్చే క్యూ కామర్స్ కల్చర్ ఇప్పుడు మెట్రో ఏరియాల్లో వేగంగా పెరుగుతోందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అయితే మెట్రోలకు వెలుపల పట్టణాల్లో మాత్రం అంత లాభదాయకంగా లేదని అంటున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

క్విక్ కామర్స్ శరవేగంగా అభివృద్ది చెందుతుంది. కానీ మెట్రో వెలుపల ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా ఉందని తాజాగా మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్ సీర్ వెల్లడించింది. గత ఐదు నెలల్లో క్విక్ కామర్స్ సంస్థల ఆదాయం ఏకంగా 150 శాతం పెరిగితే మెట్రో వెలుపల పట్టణాల్లో కేవలం 20 శాతం మాత్రమే భర్తీ అయిన్నట్లు సంస్థ తెలిపింది.

మెట్రో ఏరియాలో క్విక్ కామర్స్ పెరగడానికి కారణం.. డార్క్ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంటరై కస్టమర్లను సంతృప్తి పరచడం, తీవ్రమైన పోటీ ఉండడంతో వస్తువులు వేగంగా, నాణ్యతతో సరఫరా కావడం వంటివి. కానీ మెట్రో వెలుపల ఉన్న పట్టణాల్లో చూస్తే అక్కడ డార్క్ స్టోర్లకు వచ్చే ఆర్డర్సే చాలా తక్కువ. దీంతో డార్క్ స్టోర్లను పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంతకంతకూ ఆర్డర్లు తగ్గిపోవడంతో కంపెనీలు నష్టపోతున్నాయి. దీనివల్ల మెట్రో వెలుపల ప్రాంతాలపై ఆసక్తి ఎక్కువగా చూపించలేకపోతున్నాయి.

దీనికితోడు మెట్రో వెలుపల ప్రాంతాల్లో ఆన్‌లైన్ వస్తువులపై నమ్మకం అంతకా లేకపోవడం కూడా ఒక కారణం. అంతేకాదు డిజిటల్ టెక్నాలజీపైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే వాళ్లకు ఆన్‌లైన్ లో వస్తువులను ఎలా ఆర్డర్ చేయాలో తెలియకపోవడం దాంతో డబ్బులు ఆన్‌ లైన్ వస్తువులను ఆర్డర్ పెడితే ఎక్కడ తమ అకౌంట్లలోని డబ్బులు కట్ అయిపోతాయేమోనన్న అనుమానంతో కూడా చాలామంది ఆన్ లైన్ ఆర్డర్ కు దూరంగా ఉంటున్నారు.

కానీ, మెట్రో ఏరియాల్లో ఉండేవారు మాత్రం.. చిన్న ప్రొడెక్ట్ కావాలన్నా ఇప్పుడు ఆన్ లైన్ పైనే ఆధారపడుతున్నారు. ఆన్ లైన్ ఆర్డర్స్ చేస్తే.. సమయం ఆదా, ప్రయాణం అలసట ఉండదు, పైగా గంటలోపే డెలివరీ.. ఇవన్నీ కూడా ఎక్కువగా ఆర్డర్లను పెట్టడానికి కారణం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories