RBI: ఖాతాదారులకు మరోసారి RBI గుడ్ న్యూస్.. ఆగష్టులో మరికొంత తగ్గనున్న వడ్డీ రేట్లు

RBI
x

RBI: ఖాతాదారులకు మరోసారి RBI గుడ్ న్యూస్.. ఆగష్టులో మరికొంత తగ్గనున్న వడ్డీ రేట్లు

Highlights

RBI: తాజాగా ఖాతాదారులకు RBI మరోసారి గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చింది. ఇటీవలే వడ్డీ రేట్లు తగ్గించిన RBI మరోసారి ఆగష్టులోనూ 0.25శాతం వడ్డీ రేట్లను తగ్గించనున్నట్టు సమాచారం. వివరాలు తెలుసుకుందాం.

RBI: తాజాగా ఖాతాదారులకు RBI మరోసారి గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చింది. ఇటీవలే వడ్డీ రేట్లు తగ్గించిన RBI మరోసారి ఆగష్టులోనూ 0.25శాతం వడ్డీ రేట్లను తగ్గించనున్నట్టు సమాచారం. వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం భారత్‌లో వృద్ధి అవుట్ లుక్ మిశ్రమంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో వినిమయ డిమాండ్ బలహీనంగా ఉండగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పటిష్టంగా కొనసాగుతోంది. అంతేకాదు అమెరికాకు కూడా ఎగుమతులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కానీ ఇతర ప్రాంతాలకు అనుకున్నవిధంగా ఎగుమతులు జరగడం లేదు. ఈ పరిణామాలతో పాటు ప్రస్తుతం ద్రవ్యోల్బణంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు RBI వచ్చే నెలలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనుందని తెలుస్తోంది.

తాజా నిర్ణయాలకు సంబంధించి వచ్చే నెలలో జరిగే ఎంపీసీ సమావేశంలో రెపో రేటును మరో 25 బేస్ పాయింట్ల మేర తగ్గించాలన్ని ప్లాన్. దీనివల్ల రేటు 5.25 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.7 శాతంగా ఉండొచ్చని RBI గతంలో అంచాన వేసింది. అదేవిధంగా 2025–26 ఆర్ధిక సంవత్సరంలో ఇది 2.9 శాతం ఉండొచ్చని అంచనా వేస్తుంది.

గతంలోనూ RBI వడ్డీ రేట్లను తగ్గించింది. ఫ్రిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించింది. జూన్ నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేస్ పాయింట్లు తగ్గించిన సంగతి కూడా తెలిసిందే. ఇలా మూడు తగ్గింపుల్లో రెపో రేటు 1% తగ్గింది. ఈ రేటు ఆధారంగా బ్యాంకులు గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తాయి. RBI తీసుకొచ్చిన తాజా నిబంధనలతో ఎంతోమంది కస్టమర్లు తక్కువ వడ్డీ రేట్లు చెల్లిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories