Mukhesh Ambani: ఇండియాలోనే అతిపెద్ద లోన్ తీసుకున్న ముఖేష్ అంబానీ.. ఎన్ని వేల కోట్లు అంటే ?

Mukhesh Ambani : ఇండియాలోనే అతిపెద్ద లోన్ తీసుకున్న ముఖేష్ అంబానీ.. ఎన్ని వేల కోట్లు అంటే ?
x

Mukhesh Ambani : ఇండియాలోనే అతిపెద్ద లోన్ తీసుకున్న ముఖేష్ అంబానీ.. ఎన్ని వేల కోట్లు అంటే ?

Highlights

Mukhesh Ambani: భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 2.9 బిలియన్ డాలర్ల (దాదాపు 25 వేల కోట్ల రూపాయలు) విదేశీ రుణాన్ని పొందింది.

Mukhesh Ambani: భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 2.9 బిలియన్ డాలర్ల (దాదాపు 25 వేల కోట్ల రూపాయలు) విదేశీ రుణాన్ని పొందింది. ఈ ఏడాది భారత్‌లో ఒక కంపెనీ పొందిన అతిపెద్ద విదేశీ రుణం ఇదేనని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ లోన్‌ను 55 బ్యాంకుల సమూహం సిండికేటెడ్ రూపంలో ఇచ్చింది. ఈ ఏడాది ఆసియాలో ఏ కంపెనీకైనా ఇచ్చిన అతిపెద్ద సిండికేటెడ్ లోన్ ఇదే కావడం విశేషం.

సిండికేటెడ్ లోన్ అంటే అనేక బ్యాంకులు కలిసి ఒక కంపెనీకి రుణం ఇవ్వడం. దీనివల్ల రిస్క్ షేర్ చేసుకుంటారు. ఈ రుణాన్ని రెండు భాగాలుగా విభజించారు. మొదటిది 2.4 బిలియన్ డాలర్లు కాగా, రెండోది 67.7 బిలియన్ యెన్ (దాదాపు 462 మిలియన్ డాలర్లు). ఈ ఒప్పందం మే 9న ఖరారైంది.

అతిపెద్ద గ్లోబల్ లోన్

బ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో (జపాన్ మినహా) ఈ ఏడాది రుణాల స్థాయి గత 20 ఏళ్లలో అత్యల్పంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 29 బిలియన్ డాలర్ల విలువైన రుణ ఒప్పందాలు మాత్రమే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ భారీ రుణాన్ని పొందడం పెట్టుబడిదారులకు ఒక పెద్ద విశ్వాస సూచకంగా పరిగణించవచ్చు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్ కూడా దాని బలమైన ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. మూడీస్ సంస్థ Baa2 రేటింగ్‌ను, ఫిచ్ సంస్థ BBB రేటింగ్‌ను ఇచ్చాయి. ఇవి భారత ప్రభుత్వ రేటింగ్ కంటే కూడా మెరుగ్గా ఉండటం గమనార్హం. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో చాలా తక్కువ రిస్క్ ఉందన్నమాట. అందుకే బ్యాంకులు, పెట్టుబడిదారులు దీనిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం రిలయన్స్ ఆర్థిక విశ్వసనీయతను మరింత బలపరుస్తుంది. అంతేకాకుండా, ప్రపంచ మార్కెట్‌లో భారతీయ కంపెనీలు ఎంత బలమైన స్థానంలో ఉన్నాయో కూడా తెలియజేస్తుంది.

ఈ డబ్బు ఎక్కడ ఉపయోగిస్తారు?

బ్లూమ్‌బెర్గ్ వర్గాల సమాచారం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రుణాన్ని రెండు భాగాలుగా తీసుకుంది. మొదటి భాగం 2.4 బిలియన్ డాలర్లు కాగా, రెండో భాగం 67.7 బిలియన్ యెన్ (దాదాపు 462 మిలియన్ డాలర్లు). ఈ ఒప్పందం మే 9న జరిగింది. బ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రుణాన్ని 2025 నాటికి వడ్డీతో సహా మొత్తం 2.9 బిలియన్ డాలర్ల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories