Ambani Vs Adani: కొడుకు పెళ్లి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసింది ఎవరో తెలుసా..?

Rich Man Who Spent A lot Of Money For His Son
x

 కొడుకు పెళ్లి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసింది ఎవరో తెలుసా..?

Highlights

సంపన్నుల కుటుంబంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు మామూలుగా ఉండవు. వారి వారి రేంజ్‌కు అనుగుణంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే కొందరు వారి పిల్లల పెళ్లిళ్లు గ్రాండ్‌గా చేస్తుంటే.. మరికొందరు మాత్రం సింపుల్‌గా చేసుకుంటున్నారు.

Ambani Vs Adani: సంపన్నుల కుటుంబంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు మామూలుగా ఉండవు. వారి వారి రేంజ్‌కు అనుగుణంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే కొందరు వారి పిల్లల పెళ్లిళ్లు గ్రాండ్‌గా చేస్తుంటే.. మరికొందరు మాత్రం సింపుల్‌గా చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే మరికొందరు పెళ్లికి అయ్యే ఖర్చుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకీ వారు ఎవరో ఓ సారి చూద్దాం.

భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ.. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి పెద్ద వ్యాపార దిగ్గజాలు. వారి వారి వ్యాపారాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ వారి కుమారుల వివాహాల విషయానికొస్తే ఇద్దరూ పూర్తిగా భిన్న పద్ధతుల్లో చేశారు. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత అంబానీ వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను, తారలను ఆహానిస్తే.. అదానీ మాత్రం తన కుమారుడు జీత్ అదానీ వివాహం సాంప్రదాయ పద్ధతిలో బంధువులు సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు.

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం జులై 2024లో జరిగింది. వీరి వివాహం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల పాటు పెళ్లి హడావుడి అంతా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వారి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం బాగా వైరల్ అయింది. అదే సమయంలో జీత్ అదానీ, దివా షా వివాహం ఫిబ్రవరి 7, 2025న జరిగింది. వీరి పెళ్లి చాలా ప్రైవేట్‌గా, సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.

అనంత అంబానీ వివాహానికి దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. అంబానీ కుటుంబం మార్చి 2024లో గుజరాత్‌లోని జామ్ నగర్‌లో సుమారు రూ.800 కోట్ల ఖర్చుతో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని నిర్వహించింది. దీనికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులు హాజరయ్యారు. వందకు పైగా ప్రైవేట్ జెట్‌లు వచ్చాయి. మరోవైపు జీత్ అదానీ వివాహం అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్‌ టౌన్‌షిప్‌లోని బెల్వెడెరే క్లబ్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే పరిమితంగా హాజరయ్యారు. అయితే గౌతమ్ అదానీ తన కుటుంబం సాంప్రదాయం, సింపుల్‌ పద్దతులను ఇష్టపడుతుందని.. అందుకే వివాహం సింపుల్‌గా చేసినట్టు స్పష్టం చేశారు.

అంబానీ కుటుంబం అనంత అంబానీ వివాహాన్ని ఓ గొప్ప వేడుకగా నిర్వహించగా.. అదానీ కుటుంబం వివాహం సందర్భంగా సామాజిక సేవకు పెద్ద పీట వేసింది. పెళ్లికి రెండు రోజుల ముందు గౌతమ్ అదానీ మంగళ సేవా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా కొత్తగా వివాహం చేసుకున్న, వికలాంగ మహిళలకు జీత్ అదాని స్వయంగా ఆర్థిక సాయం అందించారు. జీత్, దివా వివాహం అయిన వెంటనే ప్రతి ఏడాది 500 మంది వికలాంగులైన మహిళల వివాహానికి రూ.10 లక్షలు విరాళం ఇస్తామని ప్రకటించారు. ఇక అదే సమయంలో వివిధ సామాజిక పనుల కోసం రూ.10 వేల కోట్లు విరాళంగా ప్రకటించారు గౌతమ్ అదానీ.

ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత అంబానీ వివాహాన్ని అత్యంత భారీ ఖర్చుతో గ్రాండ్ గా నిర్వహిస్తే.. గౌతమ్ అదానీ మాత్రం తన కుమారుడు జీత్ అదానీ వివాహాన్ని సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించి సామాజిక సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories