Roshni Nadar: ప్రపంచంలోనే టాప్‌ 5 ధనవంతమైన మహిళ రోష్ని నాడార్‌.. ఆమె నెట్‌ వర్త్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే..!

Roshni Nadar Net Worth The Journey of One of the Top 5 Richest Women in the World
x

Roshni Nadar: ప్రపంచంలోనే టాప్‌ 5 ధనవంతమైన మహిళ రోష్ని నాడార్‌.. ఆమె నెట్‌ వర్త్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే..!

Highlights

Roshni Nadar Net worth: రోష్ని నాడార్‌ దిగ్గజ భారతీయ వ్యాపారవేత్త శివ నాడార్‌ గారాల పట్టి. ఈమో ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచ టాప్ ధనవంతమైన మహిళా జాబితాలో చోటు సంపాదించుకుంది.

Roshni Nadar Net worth: ప్రపంచ టాప్‌ 5 ధనవంతమైన మహిళల జాబితాలో రోష్ని నాడార్‌ చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్ లిస్టులో రోష్ని నాడార్‌ రికార్డు సృష్టించింది. టాప్ 5 ధనవంతమైన మహిళల చోటు సంపాదించుకుంది. ఇక అపర కుబేరుడు శివ నాడార్ కూతురే రోష్ని నాడార్‌. ఆమె 47% వాటా ఆమె పేరుపై ఇటీవలె బదిలీ కావడంతో తాజాగా రిచెస్ట్ మహిళా జాబితాలో చోటు సంపాదించుకుంది .

2025 హురున్‌ గ్లోబల్ రిచ్ లిస్టులో రోష్ని నాడార్‌ చోటి సంపాదించుకోవడంతో ఆమె నికర ఆస్తుల విలువ రూ.3.5 లక్షల కోట్లకు చేరుకుందని తెలిసింది. అంటే ఈమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిచెస్ట్ ధనవంతమైన మహిళల్లో చోటు సంపాదించుకొని రికార్డు సాధించింది. టాప్‌ 5 లో రోష్ని నాడార్‌ పేరు కూడా చేర్చారు.

విద్యాభ్యాసం..

రోష్ని నాడార్‌ ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్లో విద్యాభ్యాసం చేపట్టారు. ఆ తర్వాత ఆమె నార్త్ వెస్ట్రన్ విద్యాలయంలో డిగ్రీ, కెన్లాక్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఎంబీఏ పట్టా పూర్తి చేశారు .

ఇక రోష్ని నాడార్‌ 2009 నుంచి HCL కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా పనిచేస్తున్నారు . ఆమె నైపుణ్యాలతో కంపెనీలను శిఖరాగ్రాలకు చేర్చారు. ఇక 2020 హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఇదిలా ఉండగా రోష్ని నాడార్‌ కేవలం ఒక వ్యాపార వేత్త మాత్రమే కాదు. ఆమె సామాజిక సేవలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె శివ నాడార్‌ ఫౌండేషన్‌కు కూడా ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

రోష్ని నాడార్‌ కుటుంబం విషయానికి వస్తే ఆమె HCL వ్యాపార సంస్థలకు అధినేత అయిన శివ నాడార్‌ గారి ఏకైక పుత్రిక. 1976లో ఈయన హెచ్‌సీఎల్‌ కంపెనీని ఓ గరేజ్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. అయితే రోష్ని నాడార్‌ హెచ్‌సీఎల్‌ వైస్ చైర్మన్ శేఖర్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

రోష్ని నాడార్‌ టాప్ 5 ధనవంతమైన మహిళ విషయానికి వస్తే ఆమె ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి

రోష్ని నాడార్‌ HCL టెక్నాలజీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 42.7 బిలియన్ డాలర్స్‌తో ఆమె ప్రపంచ ధనవంతమైన టాప్‌ 5 జాబితాలో నాలుగోవ స్థానం సంపాదించుకున్నారు. కాగా టాప్‌ 1వ రిచెస్ట్‌ మహిళగా అలిస్‌ వాల్టన్‌ వాల్‌మార్ట్‌ వారసురాలు 112.5 బిలియన్‌ డాలర్ల నెట్‌ వర్త్‌ కలిగి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories